News May 18, 2024
MBNR: రూ. 60 వేలు కాజేసిన సైబర్ దుండగుడు
అచ్చంపేటకి చెందిన ఓ వ్యక్తి సైబర్ వలలో చిక్కి రూ. 60 వేలు పోగొట్టుకున్నాడు. SI రాము తెలిపిన వివరాలు.. పట్టణంలోని మహేంద్ర కాలనీకి చెందన అష్రఫ్ ఫోన్‌కు ఈ నెల 2న ఓ లింక్ వచ్చింది. దానిని క్లిక్ చేయగా వెంటనే ఫోన్ హ్యాక్ అయ్యి తన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 60 వేలు విత్‌డ్రా అయినట్లు మిసేజ్ వచ్చింది. వెంటనే తేరుకున్న అష్రఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News December 8, 2024
‘మతాలకతీతంగా మనిషిని ఆవిష్కరించేదే కవిత్వం’
మతాలకతీతంగా మనిషిని ఆవిష్కరించేదే కవిత్వం అని ప్రముఖ కవులు జనజ్వాల అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రముఖ విద్యావేత్త కే లక్ష్మణ్ గౌడ్ అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం రాష్ట్ర మహాసభలు ఈనెల 14న MBNRలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మతం కంటే ముందు మనుషులని, మానవత్వమే సమాజ ప్రగతికి దోహదపడుతుందని తెలిపారు.
News December 8, 2024
మా హయంలో భీమా సౌకర్యం కల్పించాం: శ్రీనివాస్ గౌడ్
హోమ్ గార్డుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎదో ఉద్ధరిస్తారని వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతారనుకున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ నిన్న రూ. 79 పెంచి రూ. 1000 జీతం పెంచామని గొప్పలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేము అధికారంలో ఉన్నప్పుడే హోమ్ గార్డులకు ప్రభుత్వ భీమా సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.
News December 8, 2024
ఉమ్మడి జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగింది. గత 3 రోజుల క్రితమే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గినట్లు HYD వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు చలి గాలులు వీస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యల్పంగాNRPT జిల్లాలోని దామరగిద్ద మండల కేంద్రంలో 12డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12.0నుంచి 26.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.