News February 12, 2025

MBNR: రెండు రోజులకు శవమై తేలింది!

image

ఇంట్లో గొడవపడి బయటికెళ్లిపోయిన మహిళ శవమై తేలిన ఘటన గండీడ్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. పగిడ్యాల్‌కి చెందిన పద్మమ్మ(38) ఆదివారం ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవకు అలిగి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంతవెతికినా ఆమె జాడ కనిపించలేదు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత పగిడ్యాల్ మల్లమ్మచెరువులో శవమై తేలింది. పద్మమ్మకు భర్త, ముగ్గరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదైంది.

Similar News

News February 12, 2025

HYD: వేధింపులు.. శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిని మృతి (UPDATE)

image

ఫీజు కట్టాలని వేధింపులు తాళలేక మేడ్చల్‌లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అఖిల మంగళవారం ఉదయం ఆత్మహత్యకు యత్నించగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం అఖిల చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఇదే విషయమై పలువురు పాఠశాల యాజమాన్యం వైఖరిపై మండిపడుతున్నారు.

News February 12, 2025

వనపర్తి జిల్లాకు ఐటీ టవర్ మంజూరు: చిన్నారెడ్డి

image

వనపర్తి జిల్లాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) టవర్ మంజూరైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ జి చిన్నారెడ్డి తెలిపారు. బుధవారం బీఆర్ అంబేడ్కర్ సచివాలయ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశంలో జి. చిన్నారెడ్డి ఈ విషయం వెల్లడించారు. ఐటీ టవర్ నిర్మాణం కోసం రూ.22 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ఐ టీ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు.

News February 12, 2025

BCలకు సీఎం క్షమాపణలు చెప్పాలి: KTR

image

TG: బీసీల జనాభాను తగ్గించి వారిని తీవ్ర మానసిక వేదనకు గురిచేసిన CM రేవంత్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని KTR డిమాండ్ చేశారు. ‘సర్వే తప్పులతడక అని ప్రభుత్వం ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. <<15441710>>ఈసారైనా <<>>సమగ్రంగా సర్వే చేసి BCలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు జరపాలి. BC డిక్లరేషన్‌లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వరకూ కాంగ్రెస్‌ను BCలెవరూ నమ్మరని సీఎం గుర్తుపెట్టుకోవాలి’ అని KTR ట్వీట్ చేశారు.

error: Content is protected !!