News February 12, 2025

MBNR: రెండు రోజులకు శవమై తేలింది!

image

ఇంట్లో గొడవపడి బయటికెళ్లిపోయిన మహిళ శవమై తేలిన ఘటన గండీడ్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. పగిడ్యాల్‌కి చెందిన పద్మమ్మ(38) ఆదివారం ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవకు అలిగి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంతవెతికినా ఆమె జాడ కనిపించలేదు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత పగిడ్యాల్ మల్లమ్మచెరువులో శవమై తేలింది. పద్మమ్మకు భర్త, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదైంది.

Similar News

News September 15, 2025

తల్లి కాబోతున్న కత్రినా కైఫ్!

image

బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు సమాచారం. కత్రినా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని, ఈ ఏడాది అక్టోబర్/నవంబర్‌లో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు NDTV పేర్కొంది. లాంగ్ మెటర్నిటీ బ్రేక్‌లో ఉన్నారని రాసుకొచ్చింది. కత్రినా చివరిగా విజయ్ సేతుపతితో ‘మేరీ క్రిస్మస్’ మూవీలో నటించారు. కాగా 2021లో విక్కీ, కత్రినా రాజస్థాన్‌లో వివాహం చేసుకున్నారు.

News September 15, 2025

పొన్నూరు: చిన్నారి ప్రాణం తీసిన వీధి కుక్కలు

image

పొన్నూరు మండలం వెల్లలూరులో విషాదం చోటుచేసుకుంది. తాడిశెట్టి కార్తీక్(5) గత నెల 22న ఇంటి వద్ద ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడిని నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం గుంటూరు, విజయవాడ ఆసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స అందించినా సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 15, 2025

అన్నమయ్య జిల్లాలో బాలికపై లైంగిక దాడి

image

అన్నమయ్య జిల్లాలో సోమవారం అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. తంబళ్లపల్లె మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలికపై అదే ఊరికి చెందిన 12ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తంబళ్లపల్లె SI ఉమామహేశ్వర్‌రెడ్డి తెలిపారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.