News February 12, 2025

MBNR: రెండు రోజులకు శవమై తేలింది!

image

ఇంట్లో గొడవపడి బయటికెళ్లిపోయిన మహిళ శవమై తేలిన ఘటన గండీడ్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. పగిడ్యాల్‌కి చెందిన పద్మమ్మ(38) ఆదివారం ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవకు అలిగి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంతవెతికినా ఆమె జాడ కనిపించలేదు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత పగిడ్యాల్ మల్లమ్మచెరువులో శవమై తేలింది. పద్మమ్మకు భర్త, ముగ్గరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదైంది.

Similar News

News February 12, 2025

కథలాపూర్: వృద్ధురాలి మెడలో నుంచి బంగారు ఆభరణాలు లాక్కెళ్ళిన దొంగలు

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊటుపల్లి గ్రామంలో గజెల్లి లక్ష్మి అనే వృద్ధురాలి మెడలో నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలను బుధవారం మధ్యాహ్నం ఇద్దరు మహిళా దొంగలు లాకెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. లక్ష్మి అనే వృద్ధురాలు ఇంట్లో ఉండగా.. ఆధార్ కార్డు పరిశీలిస్తామని చెప్పి ఇద్దరు మహిళలు మాట్లాడుతూ వెంటనే వృద్ధురాలి మెడలో నుంచి బంగారు ఆభరణాలు లాక్కెల్లారు. పోలీసులు వచ్చి వివరాలు సేకరిస్తున్నారు.

News February 12, 2025

తూప్రాన్: చెరువులో పడి 6ఏళ్ల చిన్నారి మృతి

image

తూప్రాన్ పెద్ద చెరువులో పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన చాంద్ పాషా, పర్వీన్ కుమార్తె జుబేరియా(6) బుధవారం ఉదయం తల్లితో కలిసి పెద్ద చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లింది. ఈ క్రమంలో తల్లి బట్టలు ఉతుకుతుండగా మెట్లపై ఆడుకుంటున్న జుబేరియా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 12, 2025

సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించండి.. డీకే అరుణ విజ్ఞప్తి

image

గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికంగా నిర్వహించాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కోరారు. ఈ విషయమై బుధవారం కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీలు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఇతర ఎస్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

error: Content is protected !!