News April 25, 2024
MBNR: రెండు లోక్సభ స్థానాల్లో మహిళ ఓటర్లే అధికం
ఉమ్మడి పాలమూరులోని రెండు లోక్ సభా స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను మహిళా ఓటర్లే ప్రభావితం చేయనున్నారు. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల్లోని మొత్తం ఓటర్లలో సగానికిపైగా మగువలే ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. మహిళా ఓటర్లను మెప్పించగలిగితే గెలుపు అవకాశాలు సులభమవుతుందని పార్టీలు భావిస్తున్నాయి.
Similar News
News November 18, 2024
MBNR: “పాలమూరు యూనివర్సిటీలో SPORTS’
పాలమూరు యూనివర్సిటీలో ‘నేషనల్ ఫార్మసీ వీక్’ సందర్భంగా సోమవారం కాలేజ్ ఆఫ్ పారమెడికల్ సైన్స్ విద్యార్థులకు ప్రిన్సిపల్ నూర్జహాన్, ప్రభాకర్ రెడ్డి, యూనివర్సిటీ పీడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆట పోటీలు నిర్వహించారు. నేటి నుంచి ఈనెల 20 వరకు ఆట పోటీలు నిర్వహించనున్నారు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో నరేశ్, శారదా, మన్యంలు పాల్గొన్నారు.
News November 18, 2024
గద్వాల: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ
గద్వాల జిల్లాలో పంచాయితీరాజ్ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఎర్రవల్లి మండలం రాజశ్రీ గార్లపాడు గ్రామంలో మైనారిటీ షాదిఖానా భవన నిర్మాణ పనులకు బిల్లులు చేయడానికి ఇటిక్యాల మండల పంచాయితీరాజ్ ఏఈ పాండురంగారావు లంచం డిమాండ్ చేశారు. ఈక్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఈక్రమంలో నేడు ఏఈ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 18, 2024
గ్రూప్-3 పరీక్షలో NRPT-కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రశ్న
ఈరోజు జరిగిన గ్రూప్-3 పరీక్షల్లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఓ ప్రశ్నను అడిగారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి క్రింది వ్యాఖ్యల్లో ఏది సరైనది కాదు.? అన్న ప్రశ్న వచ్చింది. గ్రూప్-3 పరీక్షలో నారాయణపేట జిల్లా నుంచి ప్రశ్న రావడం పట్ల భారతీయ కిసాన్ సంగ్, పలువురు జలసాధన సమితి సభ్యులు, ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు.