News March 29, 2025
MBNR: రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యసేకరణ: కలెక్టర్

ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. శనివారం తన ఛాంబర్లో యాసంగి ధాన్య సేకరణపై సమీక్షించారు. యాసంగి వరి పంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ గ్రేడ్ రకానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 చొప్పున మద్దతు ధర ప్రకటించిందన్నారు. అంతేకాకుండా సన్న ధాన్యాన్నికి క్వింటాల్ కు రూ.500 బోనస్ ప్రకటించిదన్నారు.
Similar News
News April 6, 2025
మహబూబ్‌నగర్: ‘మా పోరాటం ఆగదు’

రాజ్యాంగానికి విరుద్ధంగా పాలిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తమ పోరాటం ఆగదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ అన్నారు. ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలు శనివారం మహబూబ్‌నగర్‌లో ముగిశాయి. ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారా కల్పించిన చట్టబద్ధ హక్కులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు. అధికార మదంతో మతపిచ్చి పట్టి మోదీ ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు.
News April 6, 2025
చిన్నచింతకుంట: సన్నబియ్యంతో సహపంక్తి భోజనం చేసిన ఎమ్మెల్యే

చిన్నచింతకుంట మండలం దామగ్నపూర్ గ్రామంలో సన్న బియ్యం పథకాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం బోయ బుజ్జమ్మ నివాసంలో అదే సన్న బియ్యంతో చేసిన భోజనాన్ని స్థానిక నాయకులు చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి కలిసి సహా పంక్తి భోజనం చేశారు. ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
News April 5, 2025
పాలమూరు నేతలతో KCR మీటింగ్.. BRS శ్రేణుల్లో జోష్..!

ఏప్రిల్ 27న వరంగల్‌లో BRS భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో MBNR, GDWL, NRPT, NGKL, WNP జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ MLAలు,ఇతర ముఖ్య నేతలతో ఈరోజు మాజీ సీఎం KCR సమావేశం నిర్వహించారు. జన సమీకరణ, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న KCR ప్రజాక్షేత్రంలోకి వస్తుండడంతో BRSశ్రేణుల్లో జోష్ నిండింది. భారీగా సభకు తరలివెళ్లి పాలమూరు సత్తా చాటుతామని నేతలు తెలిపారు.