News December 1, 2024

MBNR: రైతు పండుగ ముగింపు హైలైట్స్

image

✓రైతు కుటుంబాలకు 2747.67 కోట్ల రూపాయల రుణమాఫీ. ✓మహబూబ్ నగర్ జిల్లా మహిళా సమాఖ్య కోసం రూ.255 కోట్లు విడుదల.✓ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీళ్లు పారించే బాధ్యత తీసుకుంటం. ✓కొడంగల్ లో 1300 భూ సేకరణ చేసి పరిశ్రమలు స్థాపించి 25 వేల మంది యువతకు ఉద్యోగ ఉపాధ. ✓కాళేశ్వరం నుంచి చుక్క నీరు వాడకుండా 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరిపంట

Similar News

News October 25, 2025

రేపు కురుమూర్తిస్వామి అలంకరణ మహోత్సవం

image

పేదల తిరుపతిగా పేరుగాంచిన చిన్నచింతకుంట మండలం అమ్మపూర్‌లోని శ్రీ కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 22నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాలలో భాగమైన స్వామివారి అలంకరణ మహోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. ఆత్మకూరు ఎస్బీఐ బ్యాంకులో ఉన్న స్వామి వారి ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని స్వామివారికి అలంకరించనున్నట్లు ఆలయ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

News October 25, 2025

రేపు కురుమూర్తి స్వామి ఆభరణాల ఊరేగింపు

image

శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల భాగంగా ఆదివారం ఉదయం ఆత్మకూరు SBH బ్యాంకు వద్ద స్వామివారి ఆభరణాల పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. పూజ అనంతరం ఆభరణాలను ఊరేగింపుగా అమ్మాపూర్ సంస్థానాధీశులు రాజా శ్రీ రాంభూపాల్ నివాసానికి తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి స్వామికి ఆభరణాల అలంకరణతో మొదటి పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

News October 25, 2025

మన్యంకొండ: కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన

image

మన్యంకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ఆవరణలో నూతనంగా నిర్మించనున్న కళ్యాణ మండపం నిర్మాణపు పనులకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.50 లక్షల ముడా నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం కొండపై కొలువైన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.