News March 4, 2025
MBNR: రైతు వేదికలపై.. సర్కార్ ఫోకస్

రైతు వేదికలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అధికారులు ప్రత్యేక నివేదికను స్థానిక ఏఈఓలచే స్వీకరించి ఏర్పాటు చేశారు. MBNR-88, NGKL-142, GDWL-94, WNPT-71, NRPT-77 రైతు వేదికలు ఉండగా.. ఒక్క రైతు వేదిక నిర్మించడానికి రూ.22 లక్షలు ఖర్చయింది. పలు రైతు వేదికలు ధ్వంసం అవ్వగా, మరికొన్ని మౌలిక వసతులు లేవు. నిధులు మంజూరు అయితే మరమ్మతులు చేయించనున్నారు.
Similar News
News March 4, 2025
SKLM: కంటి వ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

గ్రామ స్థాయిలో కంటి వ్యాధులపై ఆప్తాల్మీక్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య DM&HO టీవీ బాలమురళీకృష్ణ అన్నారు. మంగళవారం జిల్లా DM&HO కార్యాలయంలో ఆప్తాల్మిక్ అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ప్రతి ఒక్క ఆప్తాలమిక్ అధికారి వారి పరిధిలో ఎన్జీవో ఆసుపత్రి వారు నిర్వహించే క్యాటరాక్ట్ క్యాంపులను సందర్శించి అంధత్వంతో బాధపడుతున్న వారికి రిఫర్ చేయాలన్నారు.
News March 4, 2025
MLC ఎన్నికల కోడ్ ఎత్తివేత

AP: ఉమ్మడి గుంటూరు- కృష్ణా, ఉభయగోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఎత్తేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ప్రకటన జారీ చేశారు. దీంతో గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో ఆంక్షలను ఎత్తివేయనున్నారు. గత నెల 3నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.
News March 4, 2025
ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూనిఫాం సర్వీసెస్కు రెండేళ్లు, నాన్ యూనిఫామ్ సర్వీసెస్కు 34 నుంచి 42 ఏళ్లకు వయోపరిమితి పెంచింది. సెప్టెంబర్ 30లోపు జరిగే పరీక్షలకు ఇది వర్తించనుంది. ఏపీపీఎస్సీతో పాటు పలు ఏజెన్సీలు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు దీన్ని అమలు చేయనుంది.