News February 4, 2025
MBNR: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని వేపూరిగేరికి చెందిన శ్రీనివాసులు(39) తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి అనారోగ్యంతో ఇంట్లో ఉంది. దీంతో ఒంటిరిగా జీవిస్తున్నట్లు భావించాడు. దీనికి తోడు పెళ్లికాకపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై టీడీగుట్ట రైల్వేగేట్ దగ్గర రైలు కిందపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News October 13, 2025
గూడూరు మండలంలో భూప్రకంపనలు అంటూ పుకార్లు?

గూడూరు మండల కేంద్రంలో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. కాగా మండలంలో రాత్రి ఒంటి గంట సమయంలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడింది. దీంతో ఇదేసమయంలో కొందరు స్వల్ప భూప్రకంపనలు వచ్చినట్లు SMలో పుకార్లు సృష్టించారు. భూప్రకంపనలు నిజం కాదని స్థానికులు తెలిపారు.
News October 13, 2025
Gen Z protests: పరారీలో 540 మంది ఇండియన్ ఖైదీలు!

ఇటీవల నేపాల్లో జరిగిన Gen Z నిరసనల్లో 13 వేల మంది ఖైదీలు తప్పించుకున్నట్లు అక్కడి జైళ్ల విభాగం తాజాగా వెల్లడించింది. ఇందులో 7,700 మందిని తిరిగి పట్టుకున్నామని, మరో 5వేల మంది పరారీలోనే ఉన్నారని తెలిపింది. ఇందులో 540 మంది ఇండియన్లు, 108 మంది ఇతర దేశాల వాళ్లు ఉన్నట్లు తెలిపింది. అవినీతి, వారసత్వ పాలనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారి పదుల సంఖ్యలో చనిపోయిన విషయం తెలిసిందే.
News October 13, 2025
HYD: 534 మంది మందుబాబులు పట్టుబడ్డారు!

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి డ్రంక్& డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 534 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 435 బైకులు, 18 త్రీవీలర్, 79 ఫోర్ వీలర్లు, 2 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.