News May 21, 2024

MBNR: రైలు ఢీకొని యువకుడి మృతి

image

పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన MBNR రైల్వే స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. HYDలోని చాంద్రాయణగుట్ట ఫుల్ బాగ్‌కు చెందిన షరీఫ్(17) MBNR సమీపంలోని వీరన్నపేటలో ఉన్న మేనమామ ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పట్టాలు దాటుతుండగా.. తుంగభద్ర ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని మరణించాడు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Similar News

News December 9, 2024

కొడంగల్ యువకుడికి రూ.2 కోట్ల వేతనం

image

కొడంగల్ యువకుడు జాక్ పాట్ కొట్టాడు. ప్రఖ్యాత ఐటీ కంపెనీ అమెజాన్‌లో రూ. 2కోట్ల వార్షిక వేతనంతో అమెరికాలో అప్లయిడ్ సైంటిస్ట్‌గా బొంరాస్‌పేట మం. తుంకిమెట్ల యువకుడు సయ్యద్ అర్బజ్ ఖురేషి(26) సెలక్ట్ అయ్యారు. పట్నా ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన ఇతడు USAలోని UMASS యూనివర్సిటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,మెషీన్ లెర్నింగ్‌లో MS పట్టా పొందారు.

News December 9, 2024

తెలంగాణ తల్లి తొలివిగ్రహం.. మన పాలమూరులోనే !

image

రాహుల్ గాంధీ జోడోయాత్ర 2022 OCT 23న తెలంగాణలోకి ప్రవేశించిన సందర్భంగా కర్ణాటక సరిహద్దు టై రోడ్డులో తొలిసారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం యాత్ర 3 రోజుల విరామం తర్వాత OCT 27న నారాయణపేట జిల్లాలో పునః ప్రారంభమైంది. ఈ క్రమంలో MBNR జిల్లా సరిహద్దు సీసీకుంట మం. లాల్ కోట ఎక్స్ రోడ్‌లో మరో విగ్రహం ఆవిష్కరించారు. ఇప్పుడు అదే విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది.

News December 9, 2024

MBNR: TCC కోర్సు.. మరో అవకాశం!!

image

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(TCC) పరీక్ష ఫీజు చెల్లించాలని ఆయా జిల్లాల డీఈవోలు తెలిపారు. డ్రాయింగ్ కోర్సు-లోయర్ రూ.100, హయ్యర్ రూ.150, ఎంబ్రాయిడరింగ్, టైలరింగ్ కోర్సు-లోయర్ రూ.150, హయ్యర్ రూ.200ను ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నారు. రూ.50 ఫైన్‌తో ఈనెల 10లోగా చెల్లించాలని, 10వ తరగతి ఉత్తీర్ణత అయిన అర్హులన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.