News April 6, 2025
MBNR: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందిన ఘటన నవాబుపేట మండలంలో నిన్న జరిగింది. స్థానికుల వివరాలు.. కారుకొండకి చెందిన యాదమ్మ తన కుమారుడితో కలిసి బైక్పై పనిమీద బయటికెళ్లి తిరిగివస్తున్నారు. షాద్నగర్ సమీపంలోకి రాగానే బైక్ అదుపు తప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో మహిళ తలకు తీవ్రగాయాలవటంతో అక్కడికక్కడే మృతిచెందారు.
Similar News
News April 18, 2025
పాలమూరులో నేటి ముఖ్యంశాలు!

✔ఇంగ్లిష్ టీచర్ కళ్యాణి సస్పెండ్:NGKL డీఈవో✔కార్మిక చట్టాలు నిర్వీర్యం: సీఐటీయూ ✔పరిశ్రమలపై నాగర్కర్నూల్ ఎంపీ చర్చ ✔BJPకి కాంగ్రెస్ భయం పట్టుకుంది:చిన్నారెడ్డి✔బీసీ చైతన్య సభ పోస్టర్ ఆవిష్కరణ✔పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి:TUCI✔NRPT: Way2News కథనానికి స్పందన.. ‘మొసలిని బంధించారు’✔‘పీయూ RTF కోర్స్ ఫీజులు విడుదల చేయాలి: విద్యార్థులు
News April 17, 2025
BREAKING: ఇంగ్లిష్ టీచర్ కళ్యాణి సస్పెండ్: నాగర్కర్నూల్ డీఈవో

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నాగనూల్ కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలు కళ్యాణిని సస్పెండ్ చేస్తూ డీఈవో రమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయురాలి వేధింపులు భరించలేక తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్లు డీఈవో ప్రకటించారు.
News April 17, 2025
MBNR: కార్మిక చట్టాలు నిర్వీర్యం: సీఐటీయూ

మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి ఏప్రిల్ 22న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల సదస్సు నిర్వహిస్తున్నామని జిల్లా కార్యదర్శి కురుమూర్తి తెలిపారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్ను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, అధిక ధరలు తగ్గించి, కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు.