News November 29, 2024
MBNR: రోడ్ల నిర్మాణానికై కేంద్ర మంత్రికి ఎంపీ అరుణ వినతి
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని కలిశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని పలు జాతీయ రహదారుల అనుసంధానం, సింగిల్ నుంచి డబుల్, డబుల్ నుంచి 4 లేన్స్, 6లేన్స్ రోడ్ల నిర్మాణానికి ప్రతి పాదనలతో ఉన్న వినతులను కేంద్రమంత్రికి అందించారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపింది.
Similar News
News December 6, 2024
వనపర్తి: కూతురు మరణం.. గుండెపోటుతో తండ్రి మృతి
వనపర్తి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో కూతురు చనిపోగా అది తట్టుకోలేని ఆ తండ్రి గుండె ఆగిపోయింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఖిల్లా ఘనపూర్‌లో నివాసముంటున్న దేవరశెట్టి శ్రీనివాసులు 17ఏళ్ల కుమార్తె వైశాలి అనారోగ్యంతో గురువారం చనిపోయింది. బిడ్డ మృతిని తట్టుకోలేని విలపిస్తున్న శ్రీనివాసులు కూతురు మృతదేహంపై పడి గుండెపోటుతో మృతిచెందారు. ఒకే రోజు తండ్రీకుతూరు మృతి స్థానింకగా కలిచివేసింది.
News December 6, 2024
MBNR: నియామక పత్రాలు అందజేయండి !
TGPSC ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలో JL గా ఎంపికైన అభ్యర్థులు తమకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బొందలకుంట గ్రామానికి చెందిన జయరాములు, మొల్గర గ్రామానికి చెందిన మహేశ్, చందాపురం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ తెలుగు అధ్యాపకులుగా ఎంపికయ్యారు. నియామక పత్రాలు వెంటనే అందజేసి ఇంటర్ విద్యలో తమను భాగం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
News December 6, 2024
వనపర్తి: నేడు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో కళా ప్రదర్శనలు: కలెక్టర్
ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మెగా కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కళాకారుడు డప్పుల నాగరాజు సారథ్యంలో వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో సాయంత్రం కళా ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు.