News October 23, 2024

MBNR: వంకేశ్వరంలో 41.3 మి.మీ వర్షపాతం నమోదు

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా వంకేశ్వరంలో 41.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా సోలిపూర్ లో 34.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా దామరగిద్దలో 33.3 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా హన్వాడలో 28.5 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా తొత్తినోనిదొడ్డిలో 7.5 మిల్లీమీటర్లుగా వర్షపాతం నమోదయింది.

Similar News

News October 29, 2025

MBNR: భారీ వర్షాలు… పాఠశాలలకు నేడు సెలవు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేడు సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారీ వర్షం వల్ల నేటి ఎస్ఏ-1 (SA-1) పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.

News October 29, 2025

MBNR: ‘మొంథా’ నేపథ్యంలో వరి కోతలు నిలిపివేయాలి: ఏఈఓ

image

‘మొంథా’ తీవ్ర తుఫాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు వరి కోత పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఏఈఓ యన్. హర్షవర్ధన్ సూచించారు. తుఫాను పూర్తిగా తగ్గిన తర్వాతే కోతలు ప్రారంభించాలని కోరారు. వర్షం కారణంగా పంట నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, కోసిన ధాన్యం నిల్వలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆయన రైతులకు తెలిపారు.

News October 29, 2025

అంగరంగ వైభవంగా ఉద్దాల మహోత్సవం

image

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధానఘట్టమైన ఉద్దాలమహోత్సవం మంగళవారంరాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు లక్షల మంది భక్తులు హాజరై స్వామివారి పాదుకలను దర్శించుకున్నారు. స్వామివారి పాదుకలను తాకి పునితులయ్యేందుకు భక్తులు పోటీపడ్డారు. దీంతో చిన్నవడ్డేమాన్‌, ఊకచెట్టువాగు, అప్పంపల్లి, తిర్మలాపూర్‌ గ్రామాలతోపాటు స్వామి ఆలయం వరకు జనసంద్రంమైంది. ఉత్సవంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.