News October 23, 2024
MBNR: వంకేశ్వరంలో 41.3 మి.మీ వర్షపాతం నమోదు
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా వంకేశ్వరంలో 41.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా సోలిపూర్ లో 34.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా దామరగిద్దలో 33.3 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా హన్వాడలో 28.5 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా తొత్తినోనిదొడ్డిలో 7.5 మిల్లీమీటర్లుగా వర్షపాతం నమోదయింది.
Similar News
News November 8, 2024
10న కురుమూర్తికి సీఎం రేవంత్ రెడ్డి రాక
కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం, దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ఈ నెల 10న (ఆదివారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం జాతర పరిసరాలను జిల్లా ఎస్పీ జానకి, వివిధ శాఖల అధికారులతో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హెలిప్యాడ్ కోసం స్థలాన్ని పరిశీలించారు.
News November 8, 2024
MBNR: ఉపాధ్యాయురాలు స్కెచ్.. ఏసీబీకి చిక్కిన DEO
మహబూబ్‌నగర్ ఇన్‌ఛార్జ్ డీఈఓ రవీందర్ ఏసీబీకి చిక్కడం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పదోన్నతుల్లో ఓ ఉపాధ్యాయురాలుకు దక్కాల్సిన ప్రమోషన్ మరొక ఉపాధ్యాయురాలకు దక్కడంతో ఆమె ఎన్నోసార్లు డీఈఓ రవీందర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం దక్కలేదు. కోర్టుకు వెళ్లినప్పటికీ లంచం డిమాండ్ చేయడంతో ACBకి ఆశ్రయించారు. ఈ క్రమంలో DEOను హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు.
News November 8, 2024
నేడు కురుమూర్తి స్వామి ఉద్దాల మహోత్సవం
పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు ఉద్దాల కార్యక్రమం నిర్వహించనున్నారు. స్వామివారి పాదరక్షలను ఊరేగించడాన్నే ఉద్దాల ఉత్సవమంటారు. దేవస్థానానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న వడ్డెమాన్ నుంచి ఉత్సవం ప్రారంభం కానుంది. ఉద్దాల ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.