News March 26, 2025
MBNR: వంతెన నిర్మాణ కార్మికులకు భద్రత డొల్ల

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ దగ్గర జరుగుతున్న వంతెన నిర్మాణ కార్మికుల భద్రత కరవైంది. ఎటువంటి సేఫ్టీ పరికరాలు లేకుండా ఇతర రాష్ట్రాల కార్మికులు నిర్మాణ పనుల్లో దుర్భరంగా మగ్గుతున్నారు. చూసే ప్రయాణికులు, విద్యార్థులు వాహనదారులు జంకుతున్నారు. వెంటనే కంపెనీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసుకొని కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News December 8, 2025
నంద్యాల జిల్లాలో 2.38 లక్షల మంది చిన్నారులు

డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 0 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలకు 2 చుక్కల పోలియో వ్యాక్సిన్ వేసి, వేయించి పోలియోను శాశ్వతంగా నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. జిల్లాలో 2,38,404 మంది పిల్లలు ఉన్నారని, 1318 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశామని, 5,272 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.
News December 8, 2025
ఏలూరు: PGRSకు 363 ఫిర్యాదులు- JC

ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి PGRS కార్యక్రమంలో మొత్తం 363 ఫిర్యాదులు స్వీకరించామని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ సోమవారం తెలిపారు. ఆయా శాఖల వారీగా వచ్చిన అర్జీలను పరిశీలించి, నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని JC సూచించారు.
News December 8, 2025
భద్రాచలం: అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలి: ఎస్పీ

భద్రాచలం బ్రిడ్జి వద్ద ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన SST (స్టాటిక్ సర్వేలైన్స్ టీం) చెక్ పోస్ట్‌ను ఎస్పీ రోహిత్ రాజు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ పూర్తయ్యే వరకు చెక్ పోస్టుల వద్ద పనిచేసే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని ఆదేశించారు.


