News March 26, 2025

MBNR: వంతెన నిర్మాణ కార్మికులకు భద్రత డొల్ల

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ దగ్గర జరుగుతున్న వంతెన నిర్మాణ కార్మికుల భద్రత కరవైంది. ఎటువంటి సేఫ్టీ పరికరాలు లేకుండా ఇతర రాష్ట్రాల కార్మికులు నిర్మాణ పనుల్లో దుర్భరంగా మగ్గుతున్నారు. చూసే ప్రయాణికులు, విద్యార్థులు వాహనదారులు జంకుతున్నారు. వెంటనే కంపెనీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసుకొని కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News July 11, 2025

మనుబోలు: ఉదయాన్నే రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

మనుబోలు మండలం పల్లిపాలెం వద్ద శుక్రవారం ఉదయాన్నే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. TPగూడూరు(M) గంగపట్నంకు చెందిన లక్ష్మయ్య (22) కట్టువపల్లిలో రొయ్యల గుంట వద్ద పని చేస్తున్నాడు. ఉదయాన్నే బైకుపై పల్లిపాలెం వెళ్తూ దారిమధ్యలో గేదె అడ్డు రావడంతో ఢీకొట్టాడు. తలకు గాయాలై తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు విచారణ చేపట్టారు.

News July 11, 2025

ఒంగోలు: రూ.20వేల సాయం.. 2రోజులే గడువు

image

కేంద్రం సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఇవ్వనుంది. జిల్లాలో 4.38లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకోగా రూ.2.72లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. ఇందులోనూ కొందరూ ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. అలాగే ఇంకా ఎవరైనా అర్హులుగా ఉంటే ఈనెల 13వ తేదీలోగా రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు సూచించారు

News July 11, 2025

బిజినెస్ అప్‌డేట్స్

image

*హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ (HUL) కొత్త సీఈవో, ఎండీగా ప్రియా నాయర్ నియామకం
*LICలో మరోసారి వాటాలు విక్రయించేందుకు కేంద్రం ప్రయత్నాలు
*వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోలేదన్న TCS
*కెనడా దిగుమతులపై 35 శాతం టారిఫ్స్ విధించిన ట్రంప్, ఆగస్టు 1 నుంచి అమలు