News September 3, 2024
MBNR: వరద బీభత్సం..

మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర నష్టం వాటిల్లింది. పత్తి, జొన్న, మొక్కజొన్న పంటలు నీట మునిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 622, నారాయణపేట జిల్లాలో 3,020, నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,202, గద్వాల జిల్లాలో 170 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వనపర్తి జిల్లాలో 230 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పత్తి, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు నీట మునిగినట్లు గుర్తించారు.
Similar News
News December 5, 2025
MBNR: సీఎంకు కాంగ్రెస్ కార్యకర్త లేఖ..మూడు ముక్కలైందంటూ ఆవేదన

సీఎం సార్ కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలైందని, గ్రామంలో ఓ సీనియర్ కాంగ్రెస్ నేత BRS పార్టీ నుంచి వచ్చిన వాళ్లకే వార్డు అభ్యర్థులను కేటాయించారని MBNR(D) గండీడ్(M) పెద్దవార్వాల్‌కి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లెటర్ వైరల్ అయింది. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేశామని, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ పార్టీని కాపాడాలన్నారు.
News December 5, 2025
MBNR: స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యుల నామినేషన్ల జోరు

మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రెండో రోజున వార్డు సభ్యులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజున కేవలం 175 నామినేషన్లు దాఖలు కాగా రెండో రోజున భారీగా 864 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అత్యధికంగా జడ్చర్ల మండలం నుంచి 236 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు అయ్యాయి. బాలానగర్ నుంచి 231, భూత్పూర్ 155, మూసాపేట 126, అడ్డాకుల 116 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు.
News December 5, 2025
MBNR: స్థానిక ఎన్నికలు.. భారీగా నామినేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మూడో విడత నామినేషన్ల స్వీకరణ రెండో రోజున నామినేషన్లు భారీగా దాఖలు అయ్యాయి. అత్యధికంగా జడ్చర్ల మండలం నుంచి 81 నామినేషన్లు వచ్చాయి. బాలానగర్ మండలంలో 68 నామినేషన్లు, భూత్పూర్ మండలంలో 44 నామినేషన్లు, మూసాపేట మండలంలో 19 నామినేషన్లు, అడ్డాకులలో 37 నామినేషన్లు దాఖలయ్యాయి.


