News March 24, 2025
MBNR: వరి సాగు పెరిగింది.. జలమట్టం తగ్గింది..!

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గత ఏడాది యాసంగిలో 4,76,079 ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇదే సీజన్లో 5,43,466 ఎకరాల్లో వరి సాగు కాగా.. గత సంవత్సరం ఇదే సీజన్తో పోలిస్తే 67,387 ఎకరాల్లో అధికంగా వరి సాగైనట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో భూగర్భ జలమట్టం తగ్గడంతో సాగు చేసిన వరి ఎండిపోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 26, 2025
పెద్దపల్లి: ‘బీసీ ఉద్యమాలలో మహిళలు భాగస్వామ్యం కావాలి’

పెద్దపల్లి ఆర్యవైశ్య భవనంలో నిర్వహించిన సెమినార్లో ‘బీసీ ఉద్యమాల్లో మహిళల పాత్ర’ అంశంపై చర్చ జరిగింది. బీసీ హక్కుల సాధనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరని నాయకులు అభిప్రాయపడ్డారు. బీసీలకు హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్ను 22%కు తగ్గించడం అన్యాయమని, కామారెడ్డి డిక్లరేషన్ అమలయ్యే వరకు పోరాటాలు కొనసాగుతాయని ఉద్యమకారుడు శ్రీమన్నారాయణ స్పష్టం చేశారు.
News November 26, 2025
సూర్యాపేట: పంచాయతీ ఎన్నికలు.. కలెక్టర్ ఆదేశాలు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. బుధవారం సూర్యాపేటలోని కలెక్టరేట్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్లు స్వీకరించనున్న ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మొదటి విడతలో 8 మండలాల్లో 159 జీపీ, 1,442 వార్డులకు ఎన్నికలు జరుగుతాయన్నారు.
News November 26, 2025
సీఐటీయూ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా కోటగిరి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నవంబర్ 24, 25వ తేదీల్లో జరిగిన సీఐటీయూ జిల్లా నాలుగో మహాసభలో కోటగిరి వెంకటనారాయణను జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తానన్నారు. కోటగిరి ఎన్నికపై నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు.


