News March 24, 2025

MBNR: వరి సాగు పెరిగింది.. జలమట్టం తగ్గింది..!

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గత ఏడాది యాసంగిలో 4,76,079 ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇదే సీజన్లో 5,43,466 ఎకరాల్లో వరి సాగు కాగా.. గత సంవత్సరం ఇదే సీజన్‌తో పోలిస్తే 67,387 ఎకరాల్లో అధికంగా వరి సాగైనట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో భూగర్భ జలమట్టం తగ్గడంతో సాగు చేసిన వరి ఎండిపోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Similar News

News July 6, 2025

KMR: ‘రిజర్వేషన్ ప్రకారం వాటా కల్పించాలి’

image

సబ్ ప్లాన్ నిధులను ఎస్సీ, ఎస్టీల ప్రాంతాల్లోనే ఉపయోగించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులకు ఆదేశించారు. కామారెడ్డిలో శనివారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో వారికి రిజర్వేషన్ ప్రకారం వాటా కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. భూ భారతి చట్టం ద్వారా ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలను పరిష్కరించాలన్నారు.

News July 6, 2025

ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

image

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై విద్యా శాఖ, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేజీబీవీ, ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి, రెండో దశలో చేపట్టిన అభివృద్ధి పనులు, వాటి పురోగతి గురించిన వివరాలను డీఈవో వాసంతి, ఇంజినీరింగ్ అధికారులు కలెక్టర్ స్నేహ శబరీష్‌కు వివరించారు.

News July 6, 2025

విజయవాడ: స్కిల్ హబ్‌లో పనులకు టెండర్‌లు

image

తుళ్లూరులోని అమరావతి స్కిల్ హబ్‌లో కాంక్రీట్ బ్లాక్‌ల పనులు పూర్తి చేసేందుకు CRDA శనివారం టెండర్‌లు ఆహ్వానించింది. రూ.8 లక్షల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనుల నిమిత్తం గుత్తేదారుల నుంచి టెండర్‌లు ఆహ్వానిస్తున్నామని విజయవాడలోని CRDA కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈనెల 14లోపు ఏపీ ఈ- ప్రాక్యూర్‌మెంట్ పోర్టల్ ద్వారా బిడ్‌లను సమర్పించవచ్చని సూచించింది.