News March 26, 2025

MBNR: వలస కార్మికులకు నివాసయోగ్యమైన ప్రభుత్వ పాఠశాలలు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రూరల్ మండలం (వెంకటాపూర్) అవతలిగడ్డ తండా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వలస కార్మికులకు నివాస యోగ్యమైంది. సరస్వతి నిలయాల్లో వలస కార్మికులు మద్యం, గుట్కా, ధూమపానం సేవిస్తూ పాఠశాల మౌలిక వసతులను అపరిశుభ్రం చేసి, ధ్వంసం చేస్తున్నారు. వెంటనే విద్యాశాఖ అధికారులు మూతబడిన పాఠశాలను వెంటనే తెరిపించి, బడి బయట ఉండే విద్యార్థులను పాఠశాలలో చేరే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News December 13, 2025

మాటలతో యుద్ధాలు గెలవలేం: CDS అనిల్ చౌహాన్

image

దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పాకిస్థాన్‌కు పరోక్షంగా గట్టి సందేశం ఇచ్చారు. మాటలతో యుద్ధాలు గెలవలేమని, స్పష్టమైన టార్గెట్, చర్యలే విజయాన్ని అందిస్తాయని అన్నారు. సైన్యం నిబద్ధతలోనే భారత్‌ బలం దాగి ఉందని స్పష్టం చేశారు. యుద్ధ స్వరూపం మారుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సిద్ధమవుతున్నామన్నారు.

News December 13, 2025

భూపాలపల్లి: రెండో విడత ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు

image

పలిమెల, భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల మండలాల్లో రెండో విడత ఎన్నికల పోలింగ్‌కు 600 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం, ప్రచారం చేయడం పూర్తిగా నిషేధమని ఎస్పీ స్పష్టం చేశారు.

News December 13, 2025

వంటింటి చిట్కాలు

image

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.