News February 17, 2025
MBNR: వాహనం ఢీకొని యువకుడి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన మిడ్జిల్ మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఎస్సై శివనాగేశ్వర్‌నాయుడు తెలిపిన వివరాలు.. తలకొండపల్లి మండలం వెంకటాపూర్‌కి చెందిన సోప్పరి రాఘవేందర్ మిడ్జిల్ మండలం చిల్వేర్‌లో పెళ్లికి వెళ్లి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు మృతదేహాన్ని జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు. మృతుడికి 10 నెలల క్రితమే పెళ్లయిందని స్థానికులు తెలిపారు.
Similar News
News March 26, 2025
కొడంగల్: తిరుపతిరెడ్డిపై పోస్ట్.. యువతిపై కేసు నమోదు

సీఎం రేవంత్ రెడ్డి అన్న, కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తిరుపతిరెడ్డి ఈనెల 22న కోస్గి మండలం బిజ్జూరంలో పర్యటించారు. ఆ సమయంలో ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువతిపై కేసు నమోదు చేసినట్లు SIబాల్‌రాజ్ తెలిపారు. తిరుపతిరెడ్డి భూకబ్జాలు చేసేందుకు వచ్చాడని హన్మాన్‌పల్లి వాసి పద్మ వాట్సాప్ గ్రూపుల్లో ఆధారాలు లేకుండా తప్పుడు మెసేజ్ చేసిందని NSUIఅధ్యక్షుడు అశోక్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.
News March 26, 2025
MBNR: ఆర్టీసీ బస్టాండ్‌లో కంకర తేలిన సీసీ రోడ్డు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో సీసీ రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు బస్టాండ్ ఆవరణలో నీరు నిలిచి కంకర తేలి, గొయ్యిలా ఏర్పడి ప్రయాణికులు, విద్యార్థులకు, ఆర్టీసీ బస్సు వాహనాదారులకు ఇబ్బందికరంగా మారింది. వెంటనే రోడ్డు, రవాణా, ఆర్టీసీ అధికారులు సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
News March 26, 2025
మహబూబ్‌నగర్: నేడు ఉద్యోగ మేళా

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వహిస్తున్నట్టు ఉపాధి కల్పనా అధికారి మైత్రి ప్రియ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ కార్యాలయంలో నిర్వహించే ఈ ఉద్యోగ మేళాకు విజయ ఫెర్టిలైజర్స్, ట్రెండ్స్, ధ్రువంత్ సొల్యూషన్స్ లాంటి సంస్థలు పాల్గొంటున్నాయని ఆమె వెల్లడించారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన 30ఏళ్లలోపు యువత అర్హులని అన్నారు.