News September 24, 2024

MBNR: విదేశాలకు పాలమూరు మామిడి..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పండించే మామిడిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఉద్యాన శాఖ కసరత్తు చేస్తోంది. ప్రయోగాత్మకంగా రానున్న వేసవిలో 50 నుంచి 100 టన్నుల మామిడిని విదేశాలకు పంపాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు ప్రతి జిల్లాలో 1000 ఎకరాల్లో క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎగుమతికి జాతీయ ఉద్యాన బోర్డు రూ.165 కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందజేస్తుందని ఉద్యాన శాఖ సహాయ సంచాలకుడు నరసయ్య తెలిపారు.

Similar News

News November 12, 2025

MBNR: భరోసా ఏడాది పూర్తి.. మొత్తం 163 కేసులు

image

మహబూబ్‌నగర్‌లోని భరోసా కేంద్రం స్థాపించబడి నేటికీ ఏడాది పూర్తి అయింది. మొత్తం 163 కేసులు భరోసా కేంద్రానికి అందాయి. CWC వారి భాగస్వామ్యంతో సహకారంతో POCSO కేసులు-117, రేప్ కేసులు-24, ఇతర కేసులు-22 వచ్చాయని, కౌన్సెలింగ్-218, పరిహారాలు-119 అందయన్నారు. DWO సహకారంతో ఇప్పటివరకు మొత్తం 45 బాధితులకు రూ.11,25,000 విలువైన పరిహారం అందించామని అధికారులు వెల్లడించారు.

News November 12, 2025

MBNR: చెస్ ఎంపికలకు 250 మంది క్రీడాకారుల హాజరు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17, 19 బాల, బాలికల విభాగాల్లో చెస్ ఎంపికలు నిర్వహించారు. ఎస్‌జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్. శారదాబాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 250 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికైన వారిని త్వరలో రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడా పోటీలకు పంపిస్తామని తెలిపారు. పీడీలు రామ్, వేణుగోపాల్ పాల్గొన్నారు.

News November 12, 2025

MBNR: తగ్గిన ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి

image

మహబూబ్‌నగర్ జిల్లాల్లో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ఉదయం వేళ పొలాల వద్దకు వెళ్లే రైతులు, కంపెనీలో పనిచేసే కార్మికులు, పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్ 14.3, మిడ్జిల్ 14.5, రాజాపూర్ 14.6, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 15.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.