News January 23, 2025
MBNR: విద్యార్థి అదృశ్యం.. కేసు నమోదు

విద్యార్థి అదృశ్యమైన సంఘటన నవాబుపేట మండలంలో జరిగింది. ఎస్ఐ విక్రం వివరాల ప్రకారం.. నవాబుపేట మండలంలోని లోకిరేవు గ్రామానికి చెందిన గౌతమ్ 9వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 19వ తేదీన భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామంలో మేనత్త ఇంటికి వెళ్తున్నానని చెప్పి.. వెళ్లలేదు. ఇప్పటివరకు ఆచూకీ లభించలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News November 21, 2025
నిఖత్ జరీన్ ప్రపంచ వేదికపై దేశ కీర్తిని చాటారు: రేవంత్

TG: ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో <<18345257>>స్వర్ణ పతకం<<>> సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్ను CM రేవంత్ రెడ్డి అభినందించారు. అద్భుత ప్రతిభతో మరోసారి ప్రపంచ వేదికపై దేశకీర్తిని నలుదిశలా చాటారని ప్రశంసించారు. ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో నిఖత్ మరిన్ని శిఖరాలను అధిరోహించాలని అన్నారు. తెలుగు జాతి గౌరవాన్ని నిఖత్ ఖండాంతరాలు దాటించారని మంత్రి పొన్నం ప్రభాకర్ మెచ్చుకున్నారు.
News November 21, 2025
రేపటి నుంచి వారి ఖాతాల్లో నగదు జమ

AP: విశాఖ(D) తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం భూములిచ్చిన రైతులకు రేపటి నుంచి పరిహారం అందజేయనున్నట్లు భీమిలి MLA గంటా శ్రీనివాసరావు తెలిపారు. నేరుగా రైతుల అకౌంట్లలోకి జమ చేయనున్నట్లు ప్రకటించారు. రైతుల అభ్యర్థన మేరకు ఎకరాకు నిర్ణయించిన ₹17 లక్షల ధరను ప్రభుత్వం ₹20 లక్షలకు పెంచిందని చెప్పారు. రైతుల భూములకు ఎక్కువ ధర ఇస్తామని తప్పుదోవ పట్టిస్తున్న దళారులపై ప్రభుత్వం సీరియస్గా ఉందని హెచ్చరించారు.
News November 21, 2025
వేములవాడ: భీమన్న ఆలయంలో కార్తీక దీపోత్సవం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో చివరిరోజు రాత్రి 30వ రోజు కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు, సుహాసినులకు వాయినంగా పసుపు, కుంకుమ, గాజులు, స్వామివారి ఫొటోను అందజేశారు.


