News July 2, 2024
MBNR: విధుల్లో చేరిన SGTలు.. మొత్తం 7,363 మందికి స్థాన చలనం

ఉమ్మడి జిల్లాలో SGTల బదిలీల ప్రక్రియ ముగిసింది. కనీసం రెండేళ్లు ఒకేచోట పనిచేసి బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు కూడా స్థాన చలనం కలిగింది. SGT సమాన స్థాయి ఉపాధ్యాయులకు అధికారులు సోమవారం బదిలీ ఉత్తర్వులు ఆన్లైన్లో ఉంచారు. MBNR-1,043, NGKL-847,
GDWL-506, NRPT-466, WNPT-572 మంది బదిలీ అయ్యారు. SGTలతో కలిపి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7,363 మంది ఉపాధ్యాయులకు స్థాన చలనం కలిగింది.
Similar News
News November 22, 2025
MBNR: సాఫ్ట్ బాల్..200 మంది హాజరు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-17, 19 బాల బాలికలకు సాఫ్ట్ బాల్ జట్ల ఎంపికలు మహబూబ్నగర్లోని స్టేడియంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి హాజరయ్యారు. మొత్తం 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వేణుగోపాల్, జగన్మోహన్ గౌడ్, బి.నాగరాజు, జి.రాఘవేందర్, మేరి పుష్ప, సుగుణ నాగమణి, రమణ, లక్ష్మీ నారాయణ క్రీడాకారులు పాల్గొన్నారు.
News November 22, 2025
MBNR: 24 గంటలు సిద్ధంగా ఉన్నాం.. ఫోన్ చేయండి: ఎస్పీ

బాలికలు, మహిళల భద్రతే పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని మహబూబ్నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. బస్స్టాండ్లు లేదా బహిరంగ ప్రదేశాల్లో అసురక్షితంగా అనిపిస్తే, వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 100కు లేదా షీ టీమ్ నంబర్ 8712659365కు కాల్ చేయాలని సూచించారు. మహిళల భద్రత కోసం పోలీసులు 24 గంటలు సిద్ధంగా ఉంటారని ఆమె హామీ ఇచ్చారు.