News April 3, 2024

MBNR: విమర్శలకు పదును పెట్టిన డీకే అరుణ

image

మహబూబ్ నగర్ బిజెపి అభ్యర్థి డీకే అరుణ కాంగ్రెస్ అభ్యర్థిపై విమర్శలకు పదును పెట్టారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అరుణ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్ బిజెపి పార్టీల మధ్య ఉండే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అరుణ, వంశీని టార్గెట్ చేసి ముందుకు సాగుతున్నారు.

Similar News

News December 18, 2025

MBNR: సర్పంచ్ ఎన్నికలు.. రూ.11,08,250 సీజ్

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో భాగంగా చేపట్టిన తనిఖీలు, నిఘా చర్యలలో రూ.11,08,250 నగదును సీజ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డి.జానకి వెల్లడించారు. అదేవిధంగా రూ.6,93,858 విలువగల మద్యం కేసులకు సంబంధించి 81 ఎక్సైజ్ కేసులు నమోదు చేసి 1050.23 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

News December 18, 2025

MBNR: లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి: SP

image

ఈ నెల 21 న జిల్లాలో జరిగే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి గురువారం ఓ ప్రకటనలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. క్షణికా వేషంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి లోక్ అదాలత్ కార్యక్రమం ఉత్తమ అవకాశమని, రాజీ మార్గానికి అవకాశం ఉన్న అన్ని కేసులను పరిష్కరించుకోవాలని కక్షదారులకు సూచించారు.

News December 18, 2025

MBNR: రేపు అంబులెన్స్‌ డ్రైవర్ల నియామకానికి ఇంటర్వ్యూలు

image

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 102 అంబులెన్స్‌ల్లో డ్రైవర్ల నియామకానికి ఈ నెల 19న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు, మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం, బ్యాడ్జి నంబర్ కలిగి ఉన్న 35 ఏళ్లలోపు వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో జిల్లా ఆసుపత్రిలోని 108 కార్యాలయంలో హాజరు కావాలి. 9491271103ను సంప్రదించాలని ఆయన కోరారు.