News February 5, 2025

MBNR: వివాహితపై లైంగిక దాడి

image

MBNR జిల్లా నవాబ్‌పేట మండలంలోని ఓ తండాకు చెందిన వివాహితపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గిరిజనతండాకు చెందిన వివాహిత పొలానికెళ్లి వస్తుండగా.. శంకర్‌నాయక్ ఆమెపై లైంగిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News November 28, 2025

వరంగల్: సామన్లు సర్దుకున్న పెద్దాయన!

image

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలకు పాల్పడిన పెద్దాయన హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలోని విలువైన వస్తువులను, ఫర్నిచర్లను తన ఇంటికి తరలించారు. అక్ర‘మార్కుల’ కేసులో వేటు తప్పదనే ఉద్దేశ్యంతో తన క్యాంపు కార్యాలయాల్లోని సామగ్రిని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని సమాచారం.

News November 28, 2025

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.710 పెరిగి రూ.1,28,460కు చేరింది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 650 ఎగబాకి రూ.1,17,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ.1,83,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 28, 2025

అరికాళ్ల మైసమ్మ ఆలయం కట్టడాల తొలగింపు

image

వేములవాడ పట్టణంలో పురాతనమైన అరికాళ్ల మైసమ్మ ఆలయ పరిసర కట్టడాలను తొలగించారు. ఆలయం ముందు భాగంలో మెయిన్ రోడ్ విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా భవనాలను కూల్చివేసిన క్రమంలో తాజాగా అరికాళ్ల మైసమ్మ ఆలయం పక్కన ఉన్న నిర్మాణాలను పూర్తిగా తొలగించారు. 400 ఏళ్ల చరిత్ర, రోడ్డుకు దిగువన ఉన్న అరికాళ్ల మైసమ్మ ఆలయం లోపలి భాగాన్ని అలాగే ఉంచి రక్షణ కోసం బారికేడ్లు ఏర్పాటు చేశారు.