News February 5, 2025
MBNR: వివాహితపై లైంగిక దాడి

MBNR జిల్లా నవాబ్‌పేట మండలంలోని ఓ తండాకు చెందిన వివాహితపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గిరిజనతండాకు చెందిన వివాహిత పొలానికెళ్లి వస్తుండగా.. శంకర్‌నాయక్ ఆమెపై లైంగిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News March 9, 2026
ఆ తేదీల్లో రికమండేషన్ లెటర్లు అంగీకరించం: TTD

AP: తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం సందర్భంగా ఈ నెల 17, 19 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు TTD తెలిపింది. ఈ క్రమంలో 16, 18 తేదీల్లో ఎంపీ, ఎమ్మెల్యేల రికమండేషన్ లెటర్లు అంగీకరించబోమని పేర్కొంది. అయితే వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పింది.
News March 9, 2026
ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్?.. మస్క్ రియాక్షన్ ఇదే

సూరత్(గుజరాత్)లో షాకింగ్ ఘటన జరిగింది. ‘ఎలా చనిపోవాలి? ఏ మందులు వాడాలి?’ అని ChatGPTలో అడిగి ఇద్దరు అమ్మాయిలు(18, 20ఏళ్లు) సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి Xలో పోస్టు చేయగా ఎలాన్ మస్క్ yikes(ప్రమాదకరం, షాకింగ్) అంటూ రిప్లై ఇచ్చారు. అయితే ChatGPT, Gemini Ai సూసైడ్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వట్లేదని పలువురు గుర్తుచేస్తున్నారు.
News March 9, 2026
అల్లూరి: ఇంటర్ పరీక్షలకు 124 మంది గైర్హాజర్

ఉమ్మడి అల్లూరి జిల్లాలో సోమవారం జరిగిన ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 124 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారని పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. ఆరు పరీక్ష కేంద్రాల్లో ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్ పరీక్ష జరిగింది. అల్లూరి జిల్లాలో 504 మందికి గాను 459 మంది రాశారని, పోలవరం జిల్లాలో 504కి గాను 459 మంది రాశారని తెలిపారు. చింతూరు ZPHS పరీక్ష కేంద్రాన్ని ఏజెన్సీ DEO మల్లేశ్వరావు తనిఖీ చేశారు.


