News March 27, 2025
MBNR: సంక్షేమ పథకాలు లక్ష్యం మేరకు పూర్తి చేయండి: కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లక్ష్యం మేరకు పూర్తి చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు బుధవారం కలెక్టర్ మిడ్జిల్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాగునీరు, విద్యుత్ సరఫరాలపై ముందుగా సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులతో పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News December 3, 2025
MBNR: పీయూలో ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్’ కార్యక్రమం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ ఆడిటోరియంలో ఈ నెల 6న నిర్వహించబోయే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్) కార్యక్రమం కరపత్రాన్ని వీసీ ప్రొ. జి.ఎన్. శ్రీనివాస్, రిజిస్ట్రార్ పి. రమేష్ బాబు బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, తెలంగాణ సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్‌తో కలిసి నిర్వహించనున్నారు.
News December 2, 2025
MBNR: సైబర్ నేరాలకు పాల్పడితే..1930కు ఫోన్ చేయండి

సైబర్ నేరాలకు బారిన పడినప్పుడు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలి మహబూబ్ నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. ఇవాళ జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘Fraud Ku Full Stop’ అనే నినాదంతో పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్పీ ప్రతిజ్ఞ చేశారు. సైబర్ నేరాలు రోజు రోజుకూ రూపం మార్చుకుంటున్నాయి. ఒక్క క్లిక్‌తో పెద్ద నష్టం చోటుచేసుకోవచ్చు. జాగ్రత్తగా ఉండాలన్నారు.
News December 2, 2025
మహబూబ్‌నగర్: జిల్లా ఇన్స్పెక్షన్ ప్యానెల్‌కు దరఖాస్తుల ఆహ్వానం

మహబూబ్‌నగర్ జిల్లాలోని అర్హత కలిగిన ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్ల నుంచి జిల్లా ఇన్స్పెక్షన్ ప్యానెల్ (District Inspection Panel) ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి (DEO) ఏ.ప్రవీణ్ కుమార్ తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు, ఆసక్తి గలవారు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను డిసెంబర్ 4, 2025 లోపు సమర్పించాలని ఆయన ఆదేశించారు.


