News March 30, 2024
MBNR: సంవత్సరానికి రూ.3,08,12,000 ఖర్చు
ఉమ్మడి జిల్లాలోని MBNR-441, NGKL-453, GDWL-255, WNPT-255, NRPT-280 మొత్తం 1884 నర్సరీలకు ఏటా రూ.3,08,12,000 వరకు ఖర్చవుతోంది. ఎండల తీవ్రత మూలంగా మొక్కలకు నీడ కల్పించేందుకు ఇటీవల షేడ్ నెట్‌లను కొనుగోలు చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేస్తుండటంతో చిన్నపాటి గాలులకే చిరిగిపోతున్నాయి. ప్రతి నర్సరీకి శాశ్వత షేడ్ నెట్ ఏర్పాటు చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 26, 2025
MBNR: సంక్షేమ పథకాల అమలకు నేడే శ్రీకారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను నేటి నుంచి ప్రారంభించనున్నట్లు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు.
News January 25, 2025
MBNR: BC స్టడీ సర్కిల్.. APPLY చేసుకోండి.!
ఉమ్మడి బీసీ స్టడీ సర్కిల్లో RRB, SSC, బ్యాంకింగ్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు BC స్టడీ సర్కిల్ అభివృద్ధి అధికారి ఆర్.ఇందిర, డైరెక్టర్ ఎ.స్వప్న తెలిపారు. MBNR, NGKL, NRPT జిల్లాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9లోగా www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 12,13,14న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 25, 2025
MBNR: రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం : ఎమ్మెల్యే
రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా క్రీడా మైదానంలో రూ.13 లక్షలతో నిర్మించిన డ్రెస్సింగ్ (కబడ్డీ క్రీడాకారిణిలకు) రూమ్, క్రీడా సామగ్రి స్టోర్ రూమును ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వెలికితీసి జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారులను పరిచయం చేయాలని అన్నారు.