News October 24, 2024
MBNR: ‘సమగ్ర కులాల ప్రజాభిప్రాయ సేకరణ పకడ్బందీగా నిర్వహించాలి’
సమగ్ర కులాల స్థితిగతులు తెలుసుకునేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ అన్నారు. బుధవారం హైదరాబాదు నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావుతో మాట్లాడారు.
Similar News
News November 13, 2024
అభివృద్ధి పేరుతో అమాయకుల భూములు లాక్కోవద్దు: డీకే అరుణ
అభివృద్ధి పేరుతో అమాయకుల భూములు లాక్కోవడం ఆపివేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. రైతులను పరామర్శించడానికి వెళ్తున్న ఎంపీని పోలీసులు మన్నెగూడ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆమె నిరసన వ్యక్తం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం సొంత నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్య నెలకొనడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆమె మండిపడ్డారు. అధికారం ఉందని అహంకారంతో ఏది పడితే అది చేయొద్దని సూచించారు.
News November 13, 2024
లగచర్ల దాడిలో 16 మంది అరెస్టు..
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల దాడిలో కీలక వ్యక్తి కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో అధికారులపై దాడికి ఘటనలో మొత్తం 57 మందిని అదుపులోకి తీసుకోగా.. అందులో 16 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. నిందితులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. దీని తరువాత కొడంగల్ మెజిస్ట్రేట్‌లో హాజరు పరిచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
News November 13, 2024
కురుమూర్తి స్వామి హుండీ ఆదాయం @రూ.25,54,805
ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అతిపెద్ద జాతర అయిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా హుండీని మంగళవారం లెక్కించారు. హుండీ ఆదాయం రూ.25,54,805 వచ్చినట్లు ఈవో మధుమేశ్వరరెడ్డి చెప్పారు. ఈ బ్రహోత్సవాల్లో హుండీ లెక్కింపు ఇది తొలిసారి. అయితే ఉత్సవాలు ముగిసే వరకు మరో రెండుసార్లు లెక్కించే అవకాశం ఉంది. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారుల పర్యవేక్షణలో ఆదాయం లెక్కింపు జరిగినట్లు ఈవో తెలిపారు.