News May 20, 2024
MBNR: సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం
లోక్‌సభ ఎన్నికలు పూర్తవ్వడంతో సర్పంచ్ ఎన్నికలపై అధికారులు దృష్టి సారించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 1,719 గ్రామ పంచాయతీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ లోపే వార్డుల విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని పంచాయతీలు MBNR-468 ఉండగా.. NGKL-461, GDWL-255, NRPT-280, WNP- 255 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
Similar News
News December 11, 2024
గద్వాల: ప్రేమ పెళ్లి.. అనుమానాస్పదంగా సూసైడ్
గద్వాల పట్టణంలోని భీమ్‌నగర్ కాలనీకి చెందిన <<14843542>>అనుమానాస్పదంగా <<>>పవిత్ర నిన్న మృతిచెందిన విషయం తెలిసిందే. బంధువుల, పోలీసుల వివరాల ప్రకారం.. మల్దకల్ మండలం మద్దెలబండకి చెందిన కుమ్మరి వినయ్- పవిత్ర రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వరకట్నం కోసం భర్త, కుటుంబ సభ్యుల వేధింపులతోనే తన కుమార్తె సూసైడ్ చేసుకున్నట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీను తెలిపారు.
News December 11, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!
✔గద్వాల: యువతి అనుమానాస్పద మృతి
✔ఫీజు రియంబర్మెట్స్ విడుదల చేయాలి:BC సంఘం
✔MBNR: హౌస్ వైరింగ్..ఉచిత శిక్షణ,భోజనం
✔ఉమ్మడి జిల్లాలో తగ్గుతున్న అమ్మాయిల జననాలు
✔గండీడ్,గుండుమాల్ ప్రాంతంలో చిరుత సంచారం
✔15,16 తేదీల్లో గ్రూప్- 2 పరీక్షలు: కలెక్టర్లు
✔కాంగ్రెస్ ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యం:BRS
✔సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
✔అంబులెన్స్ సేవలను ప్రారంభించిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి
News December 10, 2024
NRPT: ధరణి పెండింగ్ దరఖాస్తులు పూర్తిచేయాలి: అదనపు కలెక్టర్
పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులు వెంటనే పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ బెన్ శాలం తహశీల్దార్లను ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్‌లో జిల్లాలోని తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి విచారించాలన్నారు.