News May 11, 2024
MBNR: సాయంత్రం నుంచి మద్యం షాప్లు బంద్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి రెండు రోజులపాటు వైన్ షాప్లు బంద్ కానున్నాయి. పోలింగ్ 48 గంటల ముందు మద్యం షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు సాయంత్రం 5 నుంచి 13న సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. దీంతో మద్యం ప్రియులు నేడు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
Similar News
News September 17, 2025
MBNR: బిచ్చగాడిని హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

దేవరకద్ర బస్ స్టాండ్ సమీపంలో బిచ్చగాడిని రాళ్లతో కొట్టి హత్య చేసిన కేసులో మహబూబ్నగర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు వెంకటేష్కు న్యాయమూర్తి వి.శారదా దేవి జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధించారు. ఈ కేసు విచారణలో శ్రమించిన సీఐ రామకృష్ణ, డీఎస్పీ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
News September 16, 2025
MBNR: SP సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

MBNRలోని పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఈ రోజు నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ డి.జానకి అధికారులకు కీలక సూచనలు చేశారు.
✒CC కెమెరాల నిఘా పెంచి, పని చేయని కెమెరాలను వెంటనే రిపేర్ చేయాలి.
✒పెండింగ్లో ఉన్న అరెస్టులు, FSL రిపోర్టులు పూర్తి చేయాలి.
✒ప్రజావాణి.. వెంటనే చర్యలు తీసుకోవాలి.
✒POCSO కేసుల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలి.
✒వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
News September 16, 2025
MBNR: ఇంజినీరింగ్ కాలేజ్ HoDగా డా.రామరాజు

పాలమూరు యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ HoDగా డాక్టర్ పండుగ రామరాజు నియామకమయ్యారు. ఈ మేరకు యూనివర్సిటీ ఉపకులపతి(VC) ప్రొ.జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు డాక్టర్ పండుగ రామరాజుకు నియమక పత్రం అందజేశారు. డాక్టర్ పండుగ రామరాజు ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ, బిట్స్ పిలానీలో పీహెచ్డీ, ఐఐటి మద్రాస్లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా పనిచేశారు. డా.ఎన్.చంద్ర కిరణ్ పాల్గొన్నారు.