News June 19, 2024

MBNR: సివిల్ సర్వీసెస్ పరీక్షలపై ఉచిత శిక్షణ

image

సివిల్ సర్వీసెస్-2025 పరీక్ష రాసే అభ్యర్థులకు HYDలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా లాంగ్ టర్మ్ శిక్షణ అందించనున్నట్లు మహబూబ్ నగర్ జిల్లా బీసీ అభివృద్ధి అధికారిణి ఇందిర తెలిపారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణ పేట జిల్లాలకు చెందిన డిగ్రీ పాసై, ఆసక్తి ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈనెల 19 నుంచి తమ పేర్లను www.tgbc-studycircle.cgg.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు.

Similar News

News September 18, 2024

గద్వాల: అమ్మమ్మ మరణంతో అనాథలైన చిన్నారులు

image

అమ్మమ్మ మరణంతో చిన్నారులు అనాథలయ్యారు. వడ్డేపల్లి శాంతినగర్ చెందిన కృష్ణవేణికి ఉదయ్ కౌసిక్(11), భానుప్రకాష్(10) ఇద్దరు పిల్లలు. పిల్లల చిన్నతనంలోనే భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బంది పడ్డ కృష్ణవేణి అనారోగ్యంతో చనిపోగా తాజాగా.. ఆమె తల్లి జయమ్మ మృతితో పిల్లలు అనాథలయ్యారు. కాగా వారిని ఆస్తిని కాపాడి చిన్నారులను ఆదుకోవాలని అధికారులను స్థానికులు కోరారు.

News September 18, 2024

ఉమ్మడి జిల్లాలో వేరుశనగ సాగుకు రైతులు సన్నద్ధం !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేరుశనగను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వర్షాలు పుష్కలంగా కురవడంతో ఈ ఏడాది 2.60 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అత్యధికంగా NGKL జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో ఆ తరువాత వనపర్తి జిల్లాలో 40 వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేయనున్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

News September 18, 2024

MBNR: అరకోరగా సరఫరా అవుతున్న ఔషధాలు !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో టైఫాయిడ్, మలేరియా, డెంగీ, ఇతర విష జ్వరాలతో పాటు జలుబు, దగ్గుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని రకాల ఔషధాలు, అత్యవసర మందులు రోగులకు అందడం లేదు. MBNR- 30, WNP-15, NGKL-35, NRPT-15, GDWL-12 చొప్పున ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ఔషధాలు మాత్రం మహబూబ్ నగర్‌లో ఉన్న ఔషధ నిల్వ కేంద్రం నుంచి అరకోరగా సరఫరా అవుతున్నాయి. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.