News March 20, 2025
MBNR: సీఎం మానస పుత్రికకు నిధులేవి..?: నరసింహ

నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం తీవ్ర అన్యాయమని జల సాధన సమితి కో కన్వీనర్ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన మానస పుత్రికగా చెప్పుకునే ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అత్యధిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించిన విషయం గుర్తుపెట్టుకుని జిల్లా అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు.
Similar News
News November 22, 2025
ఎంజీఎంలో అత్యవసర సేవలపై నిర్లక్ష్యం: ఎంపీ బలరాం

WGL కలెక్టరేట్లో జరిగిన దిశా సమావేశంలో MHBD ఎంపీ పోరిక బలరాంనాయక్ ఎంజీఎంలో రాత్రి వేళ అత్యవసర వైద్యసేవలలో నిర్లక్ష్యం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర కేసుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని, షిఫ్ట్ల వారీగా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూపరింటెండెంట్ హరీశ్ చంద్రారెడ్డిని ఆదేశించారు. ఆస్పత్రి పరిశుభ్రత, పరికరాల కొరతపై చర్యలు తీసుకునేందుకు సీఎంతో చర్చిస్తామన్నారు.
News November 22, 2025
రీసర్వే.. అభ్యంతరాల పరిష్కారానికి రెండేళ్ల గడువు: RRR

AP: భూముల రీసర్వేపై రైతుల అభ్యంతరాల పరిష్కారానికి MRO స్థాయిలో ప్రస్తుతం ఏడాది గడువు ఉంది. దీన్ని రెండేళ్లకు పెంచేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని Dy.స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. 16వేల గ్రామాలకుగాను ఇప్పటికి 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తయ్యిందన్నారు. 7 లక్షల అభ్యంతరాలురాగా 2 లక్షల అభ్యంతరాలు పరిష్కారమయ్యాయని చెప్పారు. రీసర్వేను 2027 DECలోగా పారదర్శకంగా పూర్తిచేస్తామని పేర్కొన్నారు.
News November 22, 2025
వరంగల్ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

మార్గశిర మాసం సందర్భంగా వరంగల్ భద్రకాళి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా, భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మంగళ హారతులు ఇచ్చారు. దేవస్థానం పరిసరాలు భక్తి శ్రద్ధలతో సందడిగా మారాయి.


