News March 2, 2025
MBNR: సీఎం రాకతో భారీ బందోబస్తు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జోగులాంబ జోన్-7 ఎల్ ఎస్ చౌహన్ ఏర్పాట్లను పరిశీలించారు. నలుగురు SPలు, మరో నలుగురు అడిషనల్ SPలు, CIలు-21, SIలు-28, ASIలు-140, హెడ్ కానిస్టేబుళ్లు,కానిస్టేబుళ్లు, హోంగార్డులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు.
Similar News
News October 16, 2025
నేడు ఈశాన్య రుతుపవనాల ఆగమనం

ఇవాళ దక్షిణ భారతదేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు IMD పేర్కొంది. ఇదే రోజు నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమిస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు APలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు APSDMA పేర్కొంది. ఈ నెల 20కల్లా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని IMD అంచనా వేసింది. అది వాయుగుండం లేదా తుఫానుగా మారే ప్రమాదముందని హెచ్చరించింది.
News October 16, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రావద్దు: మంత్రి వాకిటి

ఇంటిలో నిర్మాణాలలో లబ్ధిదారులకు ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రావద్దని మంత్రి డాక్టర్ వాకిట శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు పట్టణంలో ఆయన కల్లుగీత డిపార్ట్మెంట్ రాష్ట్ర ఛైర్మన్ కేశం నాగరాజు గౌడ్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇల్ల నిర్మాణంలో వేగవంతం చేయాలని లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తహశీల్దార్, ఎంపీడీవోలను ఆదేశించారు.
News October 16, 2025
ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు

ఏసీబీ ముమ్మర దాడులు నిర్వహిస్తున్నా కొందరు అధికారుల్లో మార్పు రావడం లేదు. బుధవారం అనంతపురంలోని జెడ్పీ పరిషత్ క్యాంపస్‌లో సీనియర్ ఆడిటర్ లక్ష్మీనారాయణ, అటెండర్ నూర్ అక్రమ సంపాదన బాగోతం బట్టబయలైంది. లక్ష్మీనారాయణ రూ.10 వేలు, నూర్ రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.