News March 24, 2025

MBNR: సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నాను: మాజీ ఎంపీ

image

10,950 జీపీవో పోస్టులను నియమించినందుకు, వీఆర్వో, వీఆర్ఎల్‌ను కూడా క్రమబద్ధీకరించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. అలాగే కోచ్‌ల పోస్టులను క్రమబద్ధీకరించడం, కొత్త కోచ్‌ల నియామకం కూడా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి వేస్తారని ఆశిస్తున్నానన్నారు.

Similar News

News September 19, 2025

Bigg Boss: ఆ ముగ్గురు డేంజర్ జోన్‌లో!

image

ఈ వారం నామినేషన్స్‌లో సుమన్ శెట్టి, పవన్, ప్రియ, భరణి, ఫ్లోరా, మనీశ్, హరీశ్ ఉన్నారు. ఈ ఏడుగురిలో సుమన్ శెట్టి ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. హరీశ్, ఫ్లోరా కూడా మంచి పొజిషన్‌లోనే ఉండొచ్చు. కానీ మనీశ్, పవన్, ప్రియ డేంజర్ జోన్‌లో ఉండే ప్రమాదం ఎక్కువ కనిపిస్తోంది. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని రివ్యూవర్స్ ప్రిడిక్ట్ చేస్తున్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? కామెంట్ చేయండి.

News September 19, 2025

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర పతనం

image

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పత్తి ధరలు పడిపోయాయి. పత్తి గరిష్ఠంగా క్వింటాం రూ.7,665, కనిష్ఠంగా రూ.7389 పలికింది. వేరుశనగ గరిష్ఠ ధర రూ.4,568, కనిష్ఠ ధర రూ.4,093, ఆముదం గనిష్ఠ ధర రూ.6,070 పలికినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. రైతులు మాత్రం పత్తి ధర రోజురోజుకూ పతనమవుతుందని ఆందోళన చెందుతున్నారు. గతంలో రూ.8-12 వేల వరకు పత్తిని కొనుగోలు చేసేవారని అన్నారు.

News September 19, 2025

సంగారెడ్డి: ప్రమాదాలు జరగకుండా చూడాలి: ఎస్పీ

image

నేషనల్ హైవే 161 రోడ్డుపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎస్పీ పారితోష్ పంకజ్ ఆదేశించారు. పుల్కల్ మండల పరిధిలోని నేషనల్ హైవే ప్రాంతాన్ని గురువారం పరిశీలించారు. హైవేపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాల వేగం అదుపు చేసేందుకు ర్యాంబుల్ స్ట్రిప్స్, ఇసుక డ్రమ్ములు ఏర్పాటు చేయాలని సూచించారు.