News November 6, 2024
MBNR: సీఎం సహాయ నిధికి విరాళం అందజేత

రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ పాలకవర్గం సీఎం సహాయనిధికి రూ.1,51,01,116 విరాళం అందించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ చైర్మన్ కలిసి టీజీకాబ్ పాలకవర్గం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి విరాళం చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో TGCAB ఛైర్మన్ చైర్మన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 23, 2026
MBNR: పీఎం శ్రీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సెంట్రల్ అబ్జర్వర్ ఫరీదా మహమ్మద్ బాలానగర్, రాజాపూర్ పాఠశాలలను తనిఖీ చేసి నిధుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో పనుల నాణ్యత, గడువుపై కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు చేశారు.
News February 23, 2026
పాలమూరు: మత్తు వదలండి.. మైదానాలు చేరండి: మంత్రి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన సెకండ్ ఎడిషన్ సీఎం కప్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకలకు మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రపంచాన్ని వదిలి క్రీడలపై ధ్యాస పెడితే ప్రపంచం మొత్తం తమ వైపు చూస్తుందన్నారు. 33 జిల్లాల నుంచి సుమారు 1,200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
News February 23, 2026
MBNR: సౌత్ జోన్.. పీయూలో చెస్ ఎంపికలు

పీయూలో సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు చెస్ (పురుషుల) ఎంపికలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ జీఎన్ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. యూనివర్సిటీలో అన్ని సదుపాయాలు ఉన్నాయని, క్రీడాకారులు ప్రతిభ చాటి యూనివర్సిటీకి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ పూస రమేశ్ బాబు, పీడీ డా.వై.శ్రీనివాసులు, కోచ్‌లు పాల్గొన్నారు. ఎంపికైన వారు మార్చి 1న నుంచి తమిళనాడులో జరిగే టోర్నీలో పాల్గొననున్నారు.


