News May 20, 2024

MBNR: సీఎం సొంత జిల్లాలో పంతం నెగ్గేనా .. !

image

ఉమ్మడి జిల్లాలో ఎంపీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఏ ఎన్నికల్లో లేనివిధంగా ఈసారి ఉమ్మడి జిల్లా పార్లమెంట్‌ స్థానాలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో అన్ని పార్టీలు ఇక్కడ ఫోకస్ పెట్టాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 14కు 12 MLAలను కాంగ్రెస్‌ గెలిచింది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందా.. సీఎం పంతం నెగ్గేనా..? అని జిల్లాలో చర్చ జోరందుకుంది.

Similar News

News December 8, 2024

MBNR: నేడు అథ్లెటిక్స్, యోగా క్రీడాకారుల ఎంపిక

image

పాలమూరు యూనివర్సిటీలో సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు అథ్లెటిక్స్ యోగాలో స్త్రీ, పురుషుల విభాగంలో ఆదివారం ఎంపికలు నిర్వహిస్తున్నట్లు PD శ్రీనివాసులు తెలిపారు. అథ్లెటిక్స్ విభాగంలో జంప్స్, రన్స్, త్రోస్.. యోగా విభాగంలో యోగాసనాలు, సూర్య నమస్కారాలు తదితర ఆసనాలు ఉంటాయన్నారు. ప్రస్తుతం చదువుతున్న బోనఫైడ్, టెన్త్ మెమోతో హాజరు కావాలన్నారు. PU పరిధిలోని అన్ని కళాశాలల క్రీడాకారులు పాల్గొనవచ్చని చెప్పారు.

News December 8, 2024

ఏం ముఖం పెట్టుకొని సంబరాలు చేస్తున్నారు?: డీకే అరుణ

image

హైదరాబాద్ సరూర్‌నగర్ నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొని ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం ముఖం పెట్టుకొని సంబరాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలు ప్రశ్నిస్తారని భయంతో రైతులను మభ్యపెట్టడానికి సోయి మరిచి సంబరాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

News December 7, 2024

MBNR: గ్రూప్ -4 సాధించిన కానిస్టేబుళ్లు.. అభినందించిన జిల్లా ఎస్పీ

image

మహబూబ్ నగర్ జిల్లాలో ఇటీవల విధులలో చేరిన 117మంది నూతన కానిస్టేబుల్స్ అభ్యర్థులలో 12 మంది అబ్బాయిలు, ఓ అమ్మాయి మొత్తం 13మంది గ్రూప్- 4 ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన వారిని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి అభినందించారు. వీరంతా భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు.