News April 28, 2024

MBNR: సూపర్‌హీరో‌కు CM రేవంత్ రెడ్డి సన్మానం

image

సూపర్‌హీరో‌ సాయి‌చరణ్‌‌ సాహసం పట్ల‌ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. షాద్‌నగర్ పరిధి నందిగామ‌లోని ఓ ఫార్మా కంపెనీ‌లో ఈనెల 26న భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కార్మికు‌లను పదో తరగతి బాలుడు సాయిచరణ్ రిస్క్‌ చేసి కాపాడారు. ఆదివారం‌ స్థానిక MLA వీర్లపల్లి శంకర్‌ బాలుడిని సీఎం వద్దకు తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి శాలువా కప్పి అతడిని అభినందించారు.

Similar News

News December 29, 2024

MBNR: ‘మహిళలు చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి’

image

మహిళల రక్షణకు రూపొందించిన చట్టాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి ఇందిరా అన్నారు. MBNR ఆర్టీసీ డిపోలో శనివారం నిర్వహించిన న్యాయ అవగాహనసదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు నిరోధించేందుకు 2013లో కేంద్ర ప్రభుత్వం మహిళల రక్షణకు సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు.

News December 29, 2024

NRPT: ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పరిహారం ఇవ్వాలి’

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు నష్ట పరిహారం త్వరగా అందించేందుకు పోలీసులు, సెక్షన్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్‌లో షెడ్యూల్డు కులాలు, తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 15 పెండింగ్ కేసుల్లో బాధితులకు నష్ట పరిహారం అందాల్సి ఉందని డిఎస్పీ లింగయ్య తెలిపారు.

News December 29, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS.!

image

✔మన్మోహన్ సింగ్‌కు ఎమ్మెల్యేల నివాళులు✔రేపు సెమిస్..MBNR❌ సెమిస్..MBNR❌ ఇందిరమ్మ ఇండ్ల సర్వే✔నల్లమల సఫారీలో పెద్దపులి✔నేటి నుంచి APGVB సేవలు బంద్✔రేపు పలు గ్రామాల్లో కరెంట్ బంద్✔వేతనాలు చెల్లించాలని కార్మికుల ధర్నా✔కల్వకుర్తి:పచ్చ జొన్నల పేరుతో మోసం✔వనపర్తి: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం డిమాండ్✔దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు:NRPT డీఎస్పీ