News September 12, 2024
MBNR: సెప్టెంబర్ 17.. ముఖ్య అతిథులు వీరే..!

రాష్ట్రంలో సెప్టెంబర్ 17న ‘ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. MBNRలో మంత్రి జూపల్లి, GDWLలో ప్రభుత్వ క్రీడాకారుల సలహాదారులు జితేందర్ రెడ్డి, NGKLలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, NRPTలో గురునాథ్ రెడ్డి, WNPTలో ప్రీతం ముఖ్య అతిథులుగా పాల్గొని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Similar News
News October 25, 2025
రేపు కురుమూర్తి స్వామి ఆభరణాల ఊరేగింపు

శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల భాగంగా ఆదివారం ఉదయం ఆత్మకూరు SBH బ్యాంకు వద్ద స్వామివారి ఆభరణాల పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. పూజ అనంతరం ఆభరణాలను ఊరేగింపుగా అమ్మాపూర్ సంస్థానాధీశులు రాజా శ్రీ రాంభూపాల్ నివాసానికి తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి స్వామికి ఆభరణాల అలంకరణతో మొదటి పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
News October 25, 2025
మన్యంకొండ: కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన

మన్యంకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ఆవరణలో నూతనంగా నిర్మించనున్న కళ్యాణ మండపం నిర్మాణపు పనులకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.50 లక్షల ముడా నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం కొండపై కొలువైన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
News October 25, 2025
MBNR: బాధితులకు న్యాయం జరుగేలా చూడాలి: SP

MBNR జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో కోర్ట్ డ్యూటీ, కోర్ట్ లైజన్ అధికారులతో ఎస్పి డి.జానకి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కేసులో బాధితులకు న్యాయం జరుగేలా పోలీస్ అధికారులు సమయపాలన, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కోర్ట్ డ్యూటీ, లైజన్ అధికారులకు సంబంధిత ఫైళ్లు, సాక్షులు, పత్రాలు సమయానికి కోర్టులో సమర్పించే విధంగా స్పష్టమైన సూచనలు జారీ చేశారు.


