News February 20, 2025
MBNR: సేవాలాల్ జయంతి వేడుకల్లో ఎంపీ

హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎస్టీ మోర్చ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సంత్ సేవాలాల్ భోగ్ బండార్ హోమం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనుల ఆరాధ్య దైవం, హిందూ ధర్మ పరిరక్షకుడు సంత్ సేవాలాల్ మహరాజ్ అని అన్నారు. సేవాలాల్ జయంతిని ఫిబ్రవరి 15న దేశ వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని పార్లమెంట్లో తెలిపినట్లు చెప్పారు.
Similar News
News November 11, 2025
జడ్చర్ల: విద్యార్థి పై దాడి..బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు

జడ్చర్ల పట్టణంలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని కొట్టడంతో కర్ణభేరి దెబ్బతిని చెవికి గాయమైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన ఉపాధ్యాయుడిపై, పాఠశాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక న్యాయవాది పెద్దింటి రవీంద్రనాథ్ బాలల హక్కుల సంఘానికి, మానవ హక్కుల సంఘానికి ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థికి తక్షణమే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
News November 11, 2025
MBNR: ఖో-ఖో సెలక్షన్స్.. విజేతలు వీరే..!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14 విభాగంలో బాల, బాలికలకు ఖో-ఖో ఎంపికలు నిర్వహించారు. మొత్తం 550 మంది క్రీడాకారులు పాల్గొనగా.. ఎంపికైన వారిని ఉమ్మడి జిల్లా స్థాయికి పంపించారు.
✒బాలికల విభాగం
1)మొదటి బహుమతి:బాలానగర్
2)రెండవ బహుమతి:మహమ్మదాబాద్
✒బాలుర విభాగం
1)మొదటి బహుమతి:నవాబ్ పేట్
2)రెండో బహుమతి:కోయిలకొండ
News November 11, 2025
జడ్చర్ల: 305 గ్రాముల గంజాయి స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

జడ్చర్ల మండలం బండమీదిపల్లి శివారు ఆర్.బి.ఆర్ కంపెనీలో వంట మాస్టర్గా పనిచేస్తూ గంజాయి విక్రయిస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ప్రకాష్ రవిదాస్ను అరెస్ట్ చేసి అతని వద్ద 350 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ విప్లవ రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై కార్తీక్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ సిద్ధార్థ పాల్గొన్నారు.


