News March 11, 2025
MBNR: సైబర్ మోసాలతో జర జాగ్రత్త..!

ఉమ్మడి పాలమూరు పరిధి మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన డి.ఉదయ్ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కాడు. టెలిగ్రామ్ యాప్లో ఓ గ్రూప్లో యాడ్ చేసి, అందులో డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు వస్తాయని ఆశచూపగా రూ.70 వేలు పెట్టి మోసపోయాడు. బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.
Similar News
News October 19, 2025
విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్

నల్లమాడలోని KGBV పాఠశాలను కలెక్టర్ శ్యాంప్రసాద్ తనిఖీ చేశారు. తరగతి, వంట గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు కలెక్టర్ పాఠాలను బోధించారు. ప్రతి ఒక్క విద్యార్థికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకోవాలని కలెక్టర్ సూచించారు.
News October 19, 2025
ప్రకాశంకు భారీ వర్ష సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో జిల్లాలో ఆదివారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటించింది. కాగా శనివారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు జిల్లాలో కురిశాయి. ఆదివారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.
News October 19, 2025
HYD: యూట్యూబర్లపై సైబర్ క్రైమ్ కొరడా

మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ ప్రచురించినందుకు గాను రెండు యూట్యూబ్ ఛానెళ్లపై POCSO చట్టం కింద కేసు నమోదైంది. నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరించింది.