News March 11, 2025

MBNR: సైబర్ మోసాలతో జర జాగ్రత్త..!

image

ఉమ్మడి పాలమూరు పరిధి మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన డి.ఉదయ్ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కాడు. టెలిగ్రామ్ యాప్‌లో ఓ గ్రూప్‌లో యాడ్ చేసి, అందులో డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు వస్తాయని ఆశచూపగా రూ.70 వేలు పెట్టి మోసపోయాడు. బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.

Similar News

News April 10, 2026

HYD: జిల్లా కోర్టుల జడ్జీల బదిలీలు, పోస్టింగ్

image

జిల్లా& సెషన్స్ కోర్టుల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. సిటీ సివిల్ కోర్టు అడిషనల్ చీఫ్ సివిల్ జడ్జి 3- శ్రీనివాసరావు ఖమ్మం& సెషన్ కోర్టుకు జడ్జిగా బదిలీ అయ్యారు. HYD మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు జడ్జి డా.మహేశ్‌నాథ్, ఖమ్మం జిల్లా ఫ్యామిలీ కోర్టు కమ్, అడిషనల్ కోర్టుకు జడ్జిగా బదిలీ అయ్యారు. ఎల్బీనగర్ RR జిల్లా XII డిస్టిక్ & అడిషనల్ సెషన్స్ జడ్జిగా అనిత రానున్నారు.

News April 10, 2026

ఇండియన్ రైల్వేలో అతిపెద్ద కనెక్టింగ్ పాయింట్!

image

UPలోని ‘మథుర జంక్షన్’ IND రైల్వేలో అత్యంత కీలకమైన కేంద్రమనే విషయం మీకు తెలుసా? ఇక్కడ దేశం నలుమూలల నుంచి వచ్చే 7 ప్రధాన రైలు మార్గాలు ఒకేచోట కలుస్తాయి. అందుకే రోజూ దాదాపు 190రైళ్లు ఇక్కడ ఆగుతుంటాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి, ముంబై నుంచి కోల్‌కతా వరకు దేశాన్ని ఏకం చేసే అతిపెద్ద జంక్షన్ ఇదే. ఆధ్యాత్మికంగా కృష్ణ జన్మభూమి కావడంతో పాటు, భౌగోళికంగా ఇది దేశాన్ని కలిపే ‘కనెక్టింగ్ పాయింట్’గా నిలుస్తోంది.

News April 10, 2026

పెద్దపల్లి కలెక్టరేట్‌లో చలివేంద్రం ప్రారంభం

image

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో చలివేంద్రాన్ని అదనపు కలెక్టర్ వేణు శుక్రవారం ప్రారంభించారు. కలెక్టరేట్‌కు వచ్చే ప్రజల దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో బండి ప్రకాష్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.