News March 11, 2025
MBNR: సైబర్ మోసాలతో జర జాగ్రత్త..!

ఉమ్మడి పాలమూరు పరిధి మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన డి.ఉదయ్ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కాడు. టెలిగ్రామ్ యాప్లో ఓ గ్రూప్లో యాడ్ చేసి, అందులో డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు వస్తాయని ఆశచూపగా రూ.70 వేలు పెట్టి మోసపోయాడు. బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.
Similar News
News December 1, 2025
కడప: వాయిదా పడిన డిగ్రీ పరీక్ష.. మళ్లీ ఎప్పుడంటే.!

దిత్వా తుఫాను కారణంగా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ పరీక్షల తేదీలను విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె.ఎస్.వి. కృష్ణారావు సోమవారం ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీన డిగ్రీ వారికి జరగాల్సిన పరీక్షను ఈ నెల 6వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నామన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ పీజీ విద్యార్థులకు ఈనెల 9వ తేదీ ఉదయం పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు.
News December 1, 2025
పార్వతీపురం: ‘అవగాహనతోనే ఎయిడ్స్ అంతం’

ప్రజల్లో అవగాహనతోనే ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేయగలమని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది పిలుపునిచ్చారు. సోమవారం పార్వతీపురంలో ఎయిడ్స్పై అవగాహన ర్యాలీ ఆయన ప్రారంభించారు. ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత జీవన విధానాలను పాటించాలని సూచించారు. HIV అనేది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదని, సామాజిక సమస్య కూడా అని, దానిని అందరం కలిసి ఎదుర్కోవాలని అన్నారు.
News December 1, 2025
గద్వాల్: ఎయిడ్స్ బాధితుల హక్కులపై అవగాహన

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఆరోగ్య శాఖ సంయుక్తంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గద్వాల జిల్లా డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బి శ్రీనివాసులు మాట్లాడుతూ.. హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితుల హక్కుల పరిరక్షణలో న్యాయ సేవల సంస్థ చేస్తున్న సేవలను వివరించారు. ఎయిడ్స్తో బాధపడుతున్న వ్యక్తులపై వివక్ష, మానసిక వేధింపులు గురించి వివరించారు.


