News February 18, 2025
MBNR: సైబర్ వలలో ముగ్గురు వ్యక్తులు.. రూ.1.50లక్షలు స్వాహా

ఓ ప్రభుత్వ ఉద్యోగి ఖాతాలో నుంచి సైబర్ నేరస్థులు నగదు కాజేసిన ఘటన MBNR జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. గుర్తు తెలియని వ్యక్తులు ఉద్యోగికి ఫోన్ చేసి ‘నీపై స్టేషన్‌లో కేసు నమోదైంది.. రూ.లక్ష ఇస్తే కేసు లేకుండా చేస్తాం.’ అని అనటంతో ఉద్యోగి నమ్మి రూ.90వేలు వారికి పంపించారు. తర్వాత తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. మరో ఇద్దరి వ్యక్తుల నుంచి సైతం సుమారు రూ.62వేలను దోచుకున్నారు.
Similar News
News February 26, 2026
మెట్‌పల్లి ఆర్డీవో ఖమ్మం జిల్లాకు బదిలీ.. నూతన ఆర్డీవోగా నరసింహారావు

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఆర్డీవోగా పనిచేస్తున్న నక్క శ్రీనివాస్‌ను ఖమ్మం జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆర్డీవో నరసింహారావును మెట్‌పల్లికి నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
News February 26, 2026
నెల్లూరు జిల్లాలో ముమ్మరంగా పాల తనిఖీలు

రాజమండ్రి కల్తీ పాల ఘటన నేపథ్యంలో జిల్లాలో 4 రోజుల నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. ప్రభుత్వం పాల నాణ్యతను నిర్ధారించేందుకు మాజిక్ బాక్స్‌ను కేటాయించింది. దీంతో అక్కడికక్కడే పాల కల్తీని గుర్తించవచ్చు. జిల్లాలో100 వరకు డెయిరీలు ఉన్నాయని, వీటిల్లో ర్యాండమ్‌గా తనిఖీలు చేస్తున్నట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వర రావు Way2Newsకు వివరించారు.
News February 25, 2026
27న వైవీయూలో జాబ్ మేళా: ప్రిన్సిపల్

కడప YVUలో ఈ నెల 27వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ ప్రొ. టి. శ్రీనివాస్ తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, వైవీయు ప్లేస్మెంట్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ ఎంపికలు నిర్వహిస్తున్నామన్నారు. 13 కంపెనీలు విశ్వవిద్యాలయానికి వస్తున్నాయన్నారు. టెన్త్ నుంచి పీజీ చదివిన వారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 6300125455, 94405 16153 నంబర్లను సంప్రదించాలన్నారు.


