News February 18, 2025

MBNR: సైబర్ వలలో ముగ్గురు వ్యక్తులు.. రూ.1.50లక్షలు స్వాహా

image

ఓ ప్రభుత్వ ఉద్యోగి ఖాతాలో నుంచి సైబర్ నేరస్థులు నగదు కాజేసిన ఘటన MBNR జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. గుర్తు తెలియని వ్యక్తులు ఉద్యోగికి ఫోన్ చేసి ‘నీపై స్టేషన్‌లో కేసు నమోదైంది.. రూ.లక్ష ఇస్తే కేసు లేకుండా చేస్తాం.’ అని అనటంతో ఉద్యోగి నమ్మి రూ.90వేలు వారికి పంపించారు. తర్వాత తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. మరో ఇద్దరి వ్యక్తుల నుంచి సైతం సుమారు రూ.62వేలను దోచుకున్నారు.

Similar News

News April 17, 2026

హనుమకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ నియామకం

image

జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీని తాజాగా ప్రకటించారు. కమిటీలో సభ్యులుగా గడ్డం కేశవమూర్తి (IJU), బీఆర్ లెనిన్ (H143), వల్లాల జగన్ (TJA), కంకణాల సంతోశ్ (బిగ్ పేపర్), నయీమ్ (ఉర్దూ), N.బుచ్చిరెడ్డి (మీడియం), జి.మధు (స్మాల్), M.సుధాకర్ (EM), G. శ్యామ్ (PJ), బొల్లా అమర్ (VJ) ఎంపికయ్యారు. వీరితో పాటు కలెక్టర్, డీపీఆర్వో సభ్యులుగా వ్యవహరిస్తారు.

News April 17, 2026

తప్పు ఎక్కడ జరుగుతుందో అర్థం కావట్లేదు: హార్దిక్

image

IPL 2026లో MI వరుసగా 4వ మ్యాచ్‌లోనూ ఓటమి పాలవడంపై కెప్టెన్ హార్దిక్ పాండ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చెప్పడానికి ఏం లేదు. తప్పు ఎక్కడ జరుగుతుందో అర్థం కావడం లేదు. జట్టుగా విఫలమవుతున్నామా లేక ఆటగాళ్ల వ్యక్తిగత తప్పిదాలా? ప్లానింగ్‌లో లోపముందా? ఆలోచించుకొని తర్వాత ఏం చేయాలో చూస్తాం’ అని నిన్న PBKSతో ఓటమి తర్వాత అన్నారు. MI ఫెయిల్యూర్‌పై మీ అభిప్రాయం ఏంటి? Comment

News April 17, 2026

బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

మారిన జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామందిలో బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతోంది. దీనివల్ల డయాబెటిస్, హై బీపీ, గుండె జబ్బులు, లివర్ సమస్యల ప్రమాదం ఎక్కువంటున్నారు నిపుణులు. దీనికోసం ఆహారంలో బియ్యం, మైదా, స్వీట్స్, జంక్ ఫుడ్ తగ్గించడం, ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవడం, క్రమం తప్పని వ్యాయామం, మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ స్ట్రెస్ తగ్గించుకోవాలని చెబుతున్నారు.