News August 8, 2024
MBNR: స్థానిక పోరు.. జిల్లాల వారీగా వివరాలు !

త్వరలో పంచాయతీ ఎన్నికల నిర్వహించేందుకు సర్కారు యోచిస్తోంది. CM రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష నేపథ్యంలో గ్రామస్థాయి నేతల్లో ఆశలు చిగురించాయి. గ్రామాలు ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోనే ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 468, నాగర్ కర్నూల్-461, గద్వాల్-255, వనపర్తి-255, నారాయణపేట-280 పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటికే ఆయా గ్రామాల్లో నేతలు నువ్వా.. నేనా అంటూ స్థానిక ఎన్నికలపై ఫోకస్ పెట్టారు.
Similar News
News December 11, 2025
MBNR: 11 గంటల వరకు 56.63%.. మరికొద్ది నిమిషాలే టైం..!

మహబూబ్‌నగర్ జిల్లాలోని స్థానిక సంస్థల మొదటి దశ ఎన్నికల సందర్భంగా ఉదయం 11 గంటల సమయానికి 56.63% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ సమయం ముగిసేందుకు మరికొద్ది సేపు మాత్రమే ఉండటంతో ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రానికి తరలివస్తున్నారు. ప్రజలు తప్పనిసరిగా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
News December 11, 2025
మహబూబ్‌నగర్: పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య సేవలు

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి దేశ పోలింగ్ సందర్భంగా 139 గ్రామపంచాయతీలలో పోలికొనసాగుతోంది. ఆయా గ్రామపంచాయతీలలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలను ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారు ఎవరైనా అనారోగ్యానికి గురైనట్లయితే వెంటనే వారికి అక్కడే వైద్యం అందు విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే వారికి అక్కడికక్కడే అందించేందుకు అన్ని రకాల టాబ్లెట్లను సిద్ధంగా ఉంచారు.
News December 11, 2025
మహబూబ్‌నగర్ జిల్లాలో 22.55% ఓటింగ్

మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల సమయానికి 22.55% పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పోలింగ్ మందకోడిగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఉదయం 8 గంటల తర్వాత ఓటర్లు రాక మొదలైంది. పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులను జాగ్రత్తగా కేంద్రంలోకి తీసుకెళ్లి ఓటు వేయిస్తున్నారు.


