News April 3, 2025

MBNR: ‘హాని కలిగించే చర్యలను తక్షణమే అడ్డుకోవాలి’

image

గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘిస్తుండటంపై వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ మెరూకు MBNR బీఆర్ఎస్ నేత ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం అరణ్య భవన్‌లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో చట్టాలను ఉల్లంఘించి, వివిధ జంతు, వృక్ష జాతుల మనుగడకు హాని కలిగించే చర్యలను తక్షణమే అడ్డుకోవాలని వినతిపత్రంలో బీఆర్ఎస్ నేతలు కోరారు.

Similar News

News December 5, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} మూడో రోజు కొనసాగుతున్న మూడో విడత నామినేషన్ల ప్రక్రియ
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} పెనుబల్లి నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన
∆} ఖమ్మంలో ఎమ్మెల్సీ మధుసూదన్ పర్యటన

News December 5, 2025

గచ్చిబౌలి శాంతిసరోవర్‌లో ‘సండే ఈవినింగ్‌ టాక్‌’

image

బ్రహ్మకుమారీస్‌ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని శాంతిసరోవర్‌ క్యాంపస్‌లో ఆదివారం ‘సండే ఈవినింగ్‌ టాక్‌’ కార్యక్రమం నిర్వహించనున్నారు. సా.6:30 నుంచి రాత్రి 8 గం. వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ‘విలువ వినోదం’ (వాల్యూటెయిన్‌మెంట్‌) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విలువల కార్యకలాపాలు, దైవిక గీతాలాపన, ధ్యాన అనుభవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

News December 5, 2025

మూడో విడత.. నిన్న ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే.!

image

ఖమ్మం జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. రెండో రోజు గురువారం 7 మండలాల్లో కలిపి సర్పంచ్‌కు 288, అటు వార్డులకు 1173 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బుధ, గురువారాల్లో కలిపి ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, సింగరేణి, తల్లాడ, వేంసూరు మండలాల్లో 191 సర్పంచ్ స్థానాలకు గాను 378, 1742 వార్డులకు గాను 1410 నామినేషన్లు వచ్చాయి.