News March 26, 2024
MBNR: హీటెక్కిన ‘MLC ఉప ఎన్నిక’
ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప పోరు రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నువ్వా.. నేనా.. అంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటాపోటీగా ఓటర్లను క్యాంప్‌లుగా తరలించడంతో రాజకీయాలు హీటెక్కాయి. BRS సిట్టింగ్ స్థానం కావడంతో ఆ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా కాగా.. కాంగ్రెస్ సైతం పట్టు వదలకుండా పావులు కదుపుతోంది.
Similar News
News November 2, 2024
ఉమ్మడి పాలమూరు జిల్లా ఉష్ణోగ్రత వివరాలు
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా దామరగిద్దలో 34.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గద్వాల జిల్లా కల్లూరు తిమ్మందొడ్డిలో 33.8 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 33.7, వనపర్తి జిల్లా రేవల్లి లో 32.9, మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులలో 32.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News November 2, 2024
MBNR: పెళ్లిళ్ల సీజన్ షురూ.. డిసెంబర్ వరకు ముహూర్తాలే!
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మళ్లీ పెళ్లి సందడి షురూ అయ్యింది. ఆగస్టు చివర వారం వరకు పెళ్లి ముహూర్తాలు ఉండగా.. ఆ తర్వాత నుంచి వివాహానికి అనువైన శుభ ఘడియాలు రాలేదు. నవంబర్‌లో 3,7,8,9,10,13,14,15,16,17, డిసెంబర్‌లో 5,6,7,8,9,11,13, 14,15,18, 26 తేదీల్లో పెళ్లికి ఈ రెండు నెలల్లో 21 రోజులు మంచి ఘడియలు ఉన్నట్టు పురోహితులు తెలిపారు. ఇప్పటికే పెళ్లిళ్ల కోసం ఫంక్షన్‌హాళ్లు బుకింగ్‌లు మొదలయ్యాయి.
News November 2, 2024
కురుమూర్తి స్వామికి సిద్ధమవుతున్న పట్టు వస్త్రాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా కురుమూర్తి వేంకటేశ్వరస్వామికి సమర్పించేందుకు పట్టు వస్త్రాలు సిద్ధం అవుతున్నాయి. ప్రతీ ఏడాది ప్రభుత్వం లక్కీ డిప్ ద్వారా నేత కుటుంబాలను ఎంపిక చేస్తుంది. ఈసారి పగడాకుల కుర్మన్న నేత కుటుంబానికి దక్కింది. ఈ పట్టు వస్త్రాలు ఈనెల 6న అలంకారోత్సవం రోజున స్వామి వారికి సమర్పిస్తారు. నేత పనిని అత్యంత నిష్ఠతో కొనసాగిస్తారు. పని పూర్తి చేసే వరకు వారు మాంసాహారం తీసుకోరు.