News March 29, 2024

MBNR: హోరాహోరీగా సాగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

image

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగింది. ఉమ్మడి జిల్లా పరిధిలో గురువారం పోలింగ్‌ ప్రశాంతంగా ముగియగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మధ్య నువ్వా, నేనా అన్నట్లు ఎన్నికల యుద్ధం నడిచించి. అయితే లెక్క ప్రకారం వెయ్యి మందికి పైగా ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌‌కు ఉండగా.. భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు పోలింగ్‌ సరళిని బట్టి రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Similar News

News February 22, 2026

పాలమూరు: సీఎం కప్ నెట్‌బాల్ ఫైనల్‌కు నారాయణపేట జట్టు

image

మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న రెండో రాష్ట్రస్థాయి సీఎం కప్-2026 నెట్‌బాల్ పోటీల్లో నారాయణపేట జిల్లా బాలుర జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు డా. శెట్టి రమేశ్, డా. రామ్మోహన్ గౌడ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. రేపు జరగబోయే తుది పోరులో జట్టు విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.

News February 21, 2026

పాలమూరు: జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

✒ MBNR: క్రీడలతోనే మానసిక స్థైర్యం – ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
✒ MBNR:AIU వైస్ ఛాన్సలర్స్ మీట్‌లో పీయూ వీసీ
✒ నాగర్‌కర్నూల్‌లో రోడ్డు ప్రమాదం.. కారు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి
✒ ఈనెల 21న బడుల్లో పేరెంట్స్ మీటింగ్: డీఈవో
✒ NGKL:SLBC పనులు ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
✒ పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✒ ఇంటర్ పరీక్షలపై ప్రత్యేక ఫోకస్

News February 20, 2026

MBNR: AIU వైస్ ఛాన్సలర్స్ మీట్‌లో పీయూ వీసీ

image

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్స్ మీట్ 2025-26 నిర్వహించారు. “Creating AI & Quantum enabled Higher Educational Institutions” అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పీయూ వీసీ జిఎన్.శ్రీనివాస్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌తో పాటు సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్స్ కూడా పాల్గొన్నారు.